
V9 ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు -పి. గన్నవరం డిసెంబర్ 24
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవిన్యూ సదస్సుల ద్వారా భూ వివాద సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల పరిధిలోని నరేంద్రపురం గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రెవెన్యూ వివాదాలు పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించేది లేదని అధి కారులను హెచ్చరించారు. అధికారులు సిబ్బంది ఆలోచన ధోరణిలను మార్చుకొని అంకితభావాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా సదస్సుల లక్ష్యా న్ని నెరవేర్చాలని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సు ల లక్ష్యాన్ని అర్ధం చేసు కుని నిర్లక్ష్యానికి తావు లేకుండా రెవిన్యూ సిబ్బంది అంకితభావంతో పనిచే యాలన్నారు. తహశీల్దార్లు, ఆర్జీవోలు వీలున్నంతవరకు భూ తగాదాలు అక్కడికక్కడే పరిష్కారించాలని, పరిష్కారం కాని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి నిర్దేశిత ప్రొసీజర్ ప్రకారం పరిష్కారాని కి చర్యలు చేపట్టాల న్నారు. సమస్యలు పరిష్కారంలో తప్పిపుచ్చుకొనే ధోరణి ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓ మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతినిధితో పాటు అవసరం మేరకు అటవీ, దేవాదాయశాఖ అధికారులు సదస్సులకు హాజరై అందిన సమస్యలను సాధ్యమైనంత వరకు ఆదేరోజు పరిష్కరింరేం దుకు కృషి చేయాలన్నా రు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు చెక్ పెడుతూ శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీల నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ సభలో భూ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు పిజిఆర్ఎస్ కార్యక్రమం లో ప్రజల నుంచి వస్తున్న విన తుల్లో ఎక్కువ భాగం భూ సమస్య లేనని కావున ప్రతి ఒక్కరూ తమ భూముల రికా ర్డులను ఒకసారి పరిశీలించు కోవాల్సిన అవసరం ఉంద న్నారు. ప్రజలు ఎదుర్కొం టున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిం చడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిం దన్నారు దీర్ఘకాలంగా అపరి ష్కృతంగా ఉన్న భూసమ స్యలు, వివాదాల పరిష్కార మే అజెండాగా రెవెన్యూ సద స్సులు నిర్వహించాలన్నారు రెవెన్యూ సదస్సులలో పూర్తిస్థాయిలో భాగస్వా మ్యులు కావాలన్నారు.

గ్రామాలలోని భూవివాదాల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తు న్నామన్నారు. సదస్సుల్లో ప్రజలు, ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాము లైతేనే సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుంద న్నారు. కోర్టు కేసుల వివాదాలు మినహా మిగిలిన భూ వివాదాలకు అక్కడికక్కడే పరిష్కారం చూపాలని తెలిపారు. అధికారులు, గ్రామ పెద్దల సమ క్షంలో సరిహద్దు విస్తీర్ణం తగాదాలను సెటిల్ చేసే ప్రయత్నం చేయాలన్నారు. భూ కబ్బాలు, దురా క్రమణలు రుజువైతే అక్కడిక్కడే విముక్తి కల్పించాలన్నారు, ఇంటిపట్టాలపై కూడా విచారణ ఉంటుందన్నా రు. గ్రామం వారీగా ఇంటి పట్టాల లబ్దిదారుల జాబితాను బయటపెట్టి అసలైనవారు ఎవరో, అనర్హులు ఎవరో అక్కడిక క్కడే ధ్రువీకరిం చాలన్నా రు. ఈ కార్యక్ర మంలో ఆర్డీవో పి శ్రీకర్ తాసిల్దార్ పి శ్రీ పల్లవి స్థానిక ప్రజాప్ర తినిధులు తదితరులు పాల్గొన్నారు.
