ఆటో వాలాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండ ఆటో నడిపిన ఎంపీ హరీష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రామచంద్రపురం అక్టోబర్ 04:

రామచంద్రపురంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి…

అన్ని వర్గాలతో పాటు ఆటో వాలాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి అన్నారు.డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఎంపీ హరీష్,సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఎంపీ హరీష్ ఆటో నడుపుకుంటూ సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు.అనంతరం సభలో ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం నేడు మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

అటో వాలాల ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 15 వేల రూపాయల నగదును ఆటో రిక్షా,మాక్సీ క్యాబ్,మోటార్ క్యాబ్ డ్రైవర్లకు వారి అకౌంట్ లలో జమ చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో 2,90,699 మంది లబ్ధిదారులకు 436 కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిదన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రజల సేవలో నిబద్ధత కలిగిన ఉన్నారన్నారని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.

Related Articles

ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 27: ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు గావించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

30 తేదీలు31…331.84 ₹ కోట్ల మద్యం తాగేశారు!

ఆంధ్రప్రదేశ్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ధరలు తగ్గడంతో మందుబాబులు కేసులకు కేసులు ఖాళీ చేశారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.331.84కోట్ల బిజినెస్ జరిగింది. 30న రూ.219.43 […]

విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయి తెలుసు కోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక అమలాపురం నవంబరు 22: *విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల* *స్థాయి తెలుసు కోవాలి* విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయిని తెలుసు కునేందుకు […]

నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు: చిర్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 03: నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్ […]