31 వేల ఎకరాలలో వరి పంట దెబ్బతింది: కలెక్టర్ మహేష్ కుమార్

ఎఎఆర్ ఎమ్మెల్యే అఫీషియల్ -అమలాపురం అక్టోబర్ 30:

మొoథా తుఫాన్ మూలం గా నష్టపోయిన వారికి తా త్కాలిక ఉపశమనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం మరియు నిత్యవసర వస్తువులను రానున్న మూడు రోజులలో పంపిణీ చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి మొoథా తుఫా న్ ఉపశమన చర్యలు పంట నష్ట అంచనాలు రూపకల్పన పై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పున రావాస కేంద్రాలలో నిత్యవసర వస్తువు లైన ఉల్లిపాయలు బంగాళ దుంపలు కందిపప్పు, పామ్ ఆయిల్ పంచదార ప్యాక్ చేసి పంపిణీ చేయాలని 25 కేజీలు, బియ్యం మాత్రం చౌక ధరల దుకాణాల వద్ద పంపిణీ చేయాలన్నారు. అదేవి ధంగా గత ఐదు రోజులుగా చేపల వేట కోల్పోయిన మత్స్యకారుల కు చేనేత రంగ కార్మికులకు 50 కేజీల చొప్పున బియ్యా న్ని ఈ పాస్ ఎనేబుల్ పద్ధతిలో ఉచి తంగా సరఫరా చేయాలన్నారు. జిల్లావ్యాప్తం గా పునరా వాస కేంద్రాలను ఆశ్రయం పొందిన వారు సుమారు 30 వేల మంది వరకు ఉన్నారని వీరందరికీ ఆర్థిక సహాయం కుటుంబానికి రూ 3 వేలు ఒంటరి వ్యక్తులకు వెయ్యి చొప్పున అందిం చాల న్నారు. తీర ప్రాంత వ్యాప్తంగా 45 గ్రామాలలో సుమారు 30 వేల మత్స్యకార కుటుంబాలకు 50 కేజీలు బియ్యం సంబంధిత మత్స్య అభివృద్ధికారుల జీవన భృతి కోల్పోయారనే ధ్రువీకరణ తో అదేవిధంగా చేనేత జౌలి శాఖ ధ్రువీకరణతో చేనేత రంగ కార్మి కులకు ఉచితంగా అందిం చాలన్నారు. మూడు రోజులలో తుఫాన్ ఉపశమన ప్రక్రియను సంబంధిత ప్రజాప్రతినిధుల భాగ స్వామ్యంతో ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా ఉప శమన పరిహారాలు అందించు ప్రక్రియలో స్థానిక తాసిల్దారు ఎంపీడీవో సమన్వయం సహ కారం పొంది పారదర్శకంగా బియ్యం నిత్య వసరాలు పంపిణీ చేయాలన్నారు.
సముద్రపు తీర ప్రాంతంలో ఇతర జిల్లాల నుండి వలస వచ్చి తుఫాను మూలంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల జీవన భృతికి ఉచితంగా బియ్యం అందించాలన్నారు. వ్యవసాయ ఉద్యాన శాఖలు పంట నష్టాలను అంచనా వేసి లెక్కించడానికి బృం దాలను నియమించాలని ఆదేశించారు. పంట నష్ట అంచనాలు శాస్త్ర యుక్తంగా వ్యవసాయ శాస్త్రజ్ఞుల నిబంధనలు పరిగణన లోకి తీసుకొని గణించాలన్నారు జిల్లావ్యాప్తంగా ప్రాథమిక అంచనాగా సుమారు 31 వేల ఎకరాలలో వరి పంట దెబ్బ తిందని గుర్తించినట్లు తెలిపారు. రెవెన్యూ గ్రామ వ్యవసాయ సహాయకులు వ్యవసాయ అధికారులు శాస్త్రజ్ఞుల ద్వారా బృందాలు నియమించి పంట నష్ట అంచనాలను రూపొందించాలన్నారు. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు కౌలు దారులకు మాత్రమే పరిహారం అందేలా చూడాలన్నారు. తుఫాను నేపథ్యంలో పశుసం వర్ధక శాఖ 50% రాయితీతో పశుదాన సరఫరా చేసేలా 800 టన్నులు సిద్ధం చేసిందని రైతులు సద్వినియోగం చేసు కోవాలన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలల తుఫాన్ డామేజ్లను గణించాలన్నారు అలాగే పశు ఔషధాలను గణించాలన్నారు. మత్స్య శాఖ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు జెట్టీలు, హర్బర్ల డామేజ్ లను గణించాలన్నారు. గృహ నిర్మాణ సంస్థ దెబ్బతిన్న గృహాల అంచనాలను గణిం చాలన్నారు జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం వారు సి పి డబ్ల్యూ ఎస్, సింగల్ విలేజ్ స్కీముల ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లు, జనరేటర్లు వంటి నష్టాలను గణించాలన్నారు. పంచాయి తీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు డామేజ్ రోడ్లు వంతెనలు నిర్దేశిత ప్రొఫార్మాలో కిలోమీటర్ల వారీగా గణించాలన్నారు పాఠ శాల విద్యాశాఖ 47 పాఠశాలల్లో డ్యామేజీలను ఆటస్థలం కాం పౌండ్ వాల్ తో సహా ఎడ్యుకే షన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంజనీర్ల ద్వారా అంచనాలు రూ పొందించాల న్నారు. ఐ సి డి ఎస్ వారు అంగన్వాడీ కేంద్రాలు అంగ న్వాడీ కార్యాలయాల డామేజీలపై నివేదికలో సమర్పించాలన్నారు. జల వనరుల శాఖ ఇంజనీర్లు లాకులు కాలువ గట్ల షట్టర్లు డామేజ్ పై నివేదికలు రూపొం దించాలన్నారు. డ్రైనేజీ శాఖ ఇంజనీర్లు డ్రైనేజీలలో పూడికతీత షట్టర్ల రిపేర్లు డామేజ్ లను లెక్కించాల న్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పీహెచ్సీ సిహెచ్సి ఆరోగ్య కేంద్రాలు డామేజ్ లను విద్యుత్ శాఖ కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫా ర్మర్లు కండక్టర్లు డామేజీలను రూపొందించాలన్నారు. అధికా రులు తమ హెచ్ఓడీలకు జిల్లా కలెక్టర్ వారికి నివేదించే అంచనా లు ఒకే విధంగా ఇటువంటి వ్య త్యాసాలకు తావు లేకుండా సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఐదు రోజుల లో ఈ నివేదికలు రూపకల్పన చేసి సమర్పించాలని ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు కే మాధవి పి శ్రీకర్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

ఊడిమూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

రామచంద్రపురం 21 డిసెంబర్ ప్రజా ఆయుధం :: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కె.గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మెగా మెడికల్ […]

అమలాపురం ప్రజా వేదిక లో 218 అర్జీలు స్వీకరించిన కలెక్టర్స్ మరియు రెవిన్యూ అధికారులు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 6: అర్జీదారుల వ్యక్తిగత, సామాజిక సమస్యలను సంతృప్తికర స్థాయిలో నాణ్యతతో పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని […]

చించినాడ బ్రిడ్జి పై రాకపోకలు బంద్ /1995 సంవత్సరంలో నిర్మించారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం,జూలై 24: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం – దిండి గ్రామం, మల్కిపురం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య :జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం ఫిబ్రవరి 14: అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ము ఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రి పనిచేశారని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]