
తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 26:
మొంధా” తూఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమలాపురం ఎమ్మార్వో దివాకర్ అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ టి నిషాంతి సూచనలు మేరకు హెడ్ క్వార్టర్స్” అమలాపురం తహశీల్దార్ వి ఎస్ దివాకర్ అధ్యక్షతన అత్యవసర విపత్తు సమావేశం నిర్వహించారు. భారత వాతావరణ అధికారులు తూఫాన్ హెచ్చరికను ప్రతి అధికారి సవాల్ గా తీసుకోవాలని ఎమ్మార్వో దివాకర్ కోరారు. సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతిలక్ష్మి, నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ రాంబాబు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎన్ డి ఆర్ ఎఫ్, మరియు ఫైర్ డిపార్ట్మెంట్స్ అధికారులతోపాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
