మొంథా తుఫాను హెచ్చరికను పెడచెవి పెట్టొద్దు: ఎమ్మెల్యే ఆనందరావు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 26:

మొంథా” తుఫాను హెచ్చరికను పెడచెవిన పెట్టొద్దు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు నియోజకవర్గ ప్రజలను కోరారు.

భారత వాతావరణ అధికారులు వెల్లడించిన “మొంథా” తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురం నియోజకవర్గం
ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. ఈ మేరకు ఆయన అమలాపురం నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ, పశు ,పంట నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు. కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్ళేవారు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిధ్ధంగా ఉంది అన్నారు.

Related Articles

ప్రజా ఫిర్యాదులు పరిష్కారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 21, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, మండల స్థాయిలో ప్రజాఫిర్యాదులను క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా […]

మండల అధ్యక్షుడు మేడిశెట్టి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సభ విజయవంతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అయినవిల్లి మండలం తొత్తరమూడి లో మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ […]

బోడసకుర్రు గ్రామం నిర్మించిన టిడ్కో గృహాలు నివాసితులకు కనీస వసతులు కల్పిస్తూ… కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అల్లవరం ఆగస్టు 07: స్థానిక పురపాలక సంఘ పరిధిలో గృహాలబ్ధిదారులకు బోడస కుర్రు గ్రామంలో నిర్మించిన టిడ్కో సముదాయ గృహాల లో నివాసితులకు […]

రెవెన్యూ సదస్సు. గ్రామంలో పర్యటించిన ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి డిసెంబర్ 19:రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం అయినవిల్లి మండలం విలస గ్రామంలో భూ వివాద సమస్యలు పరిష్కారే లక్ష్యంగా స్థానిక ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ […]