

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 29:

మొంథా తుఫాన్ మూలంగా ముందుగా ఊహించి నంతగా తీవ్రత లేకపోయి నప్పటికీ విద్యుత్తు సరఫరా రోడ్డు రవాణా రాకపోకలకు ఇబ్బందిని కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యాన మార్కెటింగ్ డైయి రీ డెవలప్మెంట్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్న నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లాస్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులతో మొంథా తుఫాన్ సహాయక చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోతుఫాను ఈదురు గాలులు మూలంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 300 విద్యుత్ స్తంభాలు నేలకొరి గాయని వాటి పునరుద్ధరణ పనులు 80 శాతం వరకు నిర్వహించడం జరిగిందని మిగిలిన 20 శాతం రానున్న రెండు గంటలలో పూర్తిచేసి ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాను పూ ర్తిగా పునరుద్ధరిస్తామన్నారు. ఎండి పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు రేయింబవళ్లు జరుగుతు న్నాయన్నారు. జిల్లావ్యా ప్తంగా 54 సబ్ స్టేషన్ లపై మొంథా తుఫాన్ ప్రభావం పడిందని మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగిందన్నారు.

ఆ దిశగా పునరు ద్ధరణకు చర్యలు వేగవంతం అయ్యాయన్నారు రామచంద్రపురం రాజమహేంద్రవరం ముమ్మిడివరం తదిత ప్రాంతాల నుండి మానవ వనరులను తరలించి విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 134 కిలోమీటర్ల మేర రహదారులపై నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రహదారులపై రాకపోకలు పునరుద్ధరణ ఇప్పటికీ పూర్తయిందన్నారు. నేటి నుండి ఆర్టీసీ బస్సులు నూటికి నూరు శాతం రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు.

మంగళవా రం పునరావాస కేంద్రాలలో భోజన వసతి పొంది వారినీ బుధవారం సాయంత్రం వరకు పునరావాస కేంద్రాలలోని ఆశ్రయం కల్పిస్తూ రాత్రి భోజనం అనంతరం తిరిగి స్వగృ హాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 వేల ఆర్థి క సహాయం అందించి పంపించాలని అధికారులు ఆదేశించారు. జిల్లా వ్యాప్తం గా 400 పునరావాస కేంద్రాలు నిర్వహించి 10, 150 మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందని తెలిపారు. వీరిలో కుటుంబాలకు రూ3 వేలు చొప్పున ఒంటరి సభ్యులకు రూ.1000చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ చేయాలన్నారు.

అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లకుండా జీవ నోపాధి కోల్పోయిన మత్స్యకారులకు చేనేత కార్మికులకు కుటుంబానికి 50 కిలోలు చొప్పున ఉచి తంగా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించి ఉన్నా రని ఆయన స్పష్టం చేశారు. నేటి నుండే బియ్యం పంపిణీ ప్రక్రియను రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతిని ఆదే శించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాలు లో వరి పంట మొంథా తుఫాన్ ప్రభావం తో నష్టా నికి గురైందని ప్రాథ మికంగా అంచనా వేయడం జరిగిం దని అలాగే ఉద్యాన పంటలైన అరటి తదితర పంటలకు తుఫాన్ ప్రభా వంతో నష్టం వాటిలినట్లు ఆయన తెలిపారు.

వరి, ఉద్యాన పంటల నష్టానికి సంబంధించిన అంచనాల బృందాలు నియమించి నియమించి పూర్తిస్థాయి నివేదికను గణించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాల య శాస్త్రవేత్తల ద్వారా పంటల నష్టాలను తగ్గిం చడానికి కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక సహాయా న్ని పారదర్శకంగా అందిం చాలని సూచించారు. బియ్యం పంపిణీ ఆర్థిక సహాయం పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగ స్వాములు చేయాలన్నారు. మామిడికుదురు మండలంలో చనిపోయిన మహిళకు పోస్టుమార్టం అనంతరం టిఆర్ 27 నష్టపరిహారం ఐదు లక్షలు స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మొంథా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి విజయరామరాజు,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్థానిక ఎంపీ జి హరీష్ మాధుర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ నిశాంతి, శాసనస భ్యులు అయితాబత్తులు ఆనందరావు, నిమ్మకాయల చిన్న రాజప్ప అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మెట్ల రమణబాబు డిఆర్ఓ కే మాధవి తదితరులు పాల్గొన్నారు.
