వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు 27, 28, 29 తేదీలలో కోనసీమలో తుఫాన్ ప్రభావం: కలెక్టర్ మహేష్ కుమార్

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 25:

భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంటుందని అదేవిధంగా స్థానికంగా తీరాన్ని దాటే అవకాశాలు కూడా ఉన్నాయని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావ హెచ్చ రికలు తుఫాన్ ను ఎదుర్కొనే సన్నద్ధత చర్యలపై జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రజా నీకం అప్రమత్తంగా కావా లని సూచించారు. జిల్లా వాసులు అత్యవసరం అయితే తప్ప మిగిలిన అన్ని ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు. అనవసరం గా తుఫాన్ హెచ్చరికలు మూలంగా ఎవరు సంచ రించరాదని, ఈ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవడంతోపాటుగాఈదురుగాలులు వేగంగా వీచే అవకాశం ఉందని తెలి పారు. కార్తీక మాసం సంద ర్భంగా భక్తులు నది స్నా నాలు దైవదర్శనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రం అమలాపురంలో 24 x 7 అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూమ్ నెంబర్ 08856_ 293104 ఏర్పాటు చేయడం జరిగిందని తు ఫాన్ ప్రభావంతో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంప్రదించి తగు పరిష్కార మార్గాలు పొం దాలన్నారు. అదేవిధంగా తుఫాన్ హెచ్చరికలపై విస్తృత ప్రచారం గ్రామా లలో టామ్ టామ్ రెండు రోజులు పాటు నిర్వహించి తీర ప్రాంత ఆవాసాలలోని ప్రజలను అప్రమత్తం చేయా లన్నారు. ఆర్డీవోలు తాసిల్దార్లు సముద్ర తీరం వెంబడి ఉన్న తుఫాన్ పునరావాస కేంద్రాలను సిద్ధం ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్న ఆవాసాలను ఇప్పటికే మ్యాపింగ్ చేయడం జరిగిం దని ఆ ప్రకారం స్థానికంగా ఉన్న తుఫాన్ పునరావస్ కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలన్నారు. తీర ప్రాంత పూరి గుడి సెలలో నివసి స్తున్న వారి వివరాలను కూడా సేకరించాలన్నారు. వీఆర్వో పంచాయతీ కార్య దర్శులను పునరావస్ కేంద్రాల నిర్వహణకు ఇన్చా ర్జిలుగా నియమించాలన్నా రు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పంచాయతీరాజ్ శాఖ చేపట్టాలన్నారు. 90 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం వెంబడి మూడు కిలోమీటర్ల కు ఒకరు చొప్పు న ఇన్చార్జులను నియమి స్తూ తుఫాన్ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు తీర ప్రాంత సమస్యలను ఇన్చార్జులు మెరైన్ పోలీ సులకు తెలపాలన్నారు. ఈనెల 27 నాటికి నిత్యవస రాలన్నీ తీర ప్రాంత గ్రామా లకు ఐదు రోజుల పాటు అవసరాలు మేరకు అందిం చాలన్నారు. మత్స్యకారు లు ఎవరు సముద్రంపై వేటకు వెళ్ళరాదన్నారు సముద్రంపై వేటలో ఉన్న వారిని వెంటనే తిరిగి రప్పించాలన్నారు. లైఫ్ జాకెట్లు సిద్ధం చేయాల న్నారు రానున్న రెండు వారాలలో ప్రసవ తేదీలు ఉన్న 428 మంది గర్భిణీ స్త్రీలను గుర్తించడం జరిగిం దని వీరిని సమీపంలోని పీహెచ్సీ సిహెచ్ బర్త్ వె యిటింగ్ హాలుకు వెంటనే తరలించాలని వైద్యాధికా రుల ఆదేశించారు. అదే వి ధంగా జనరేటర్లు అంబు లెన్సులు అత్యవసర ఔష ధాలు సిద్ధపరచుకోవాల న్నారు. ఏపీ ఈపీడీసీఎల్ కార్మికులను,కరెంటు స్తంభాలను ట్రా న్స్ఫార్మర్ల ను మెటీరియల్ ముంద స్తుగా సిద్ధసందర్భం లోవాలన్నారు. స్తంభాలు కూలి విద్యుత్ అంతరా యం ఏర్పడిన సందర్భంలో అర్ధగంటలో స్తంభాలను మార్చాలన్నారు. ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లు సి పి డబ్ల్యూ ఎస్ పథకాల వద్ద విద్యు త్తుకు ప్రత్యామ్నా యంగా జనరేటర్లు సిద్ధం చేసుకొని నిరంతరాయంగా త్రాగు నీరు సరఫరా చేయాల న్నారు. ఆర్ అండ్ బి ఇంజనీర్లు పవర్ జెసిబి లు క్రీమ్స్ సిద్ధపరచుకోవాల న్నారు. అగ్నిమాపక శాఖ విపత్తు నిర్వహణ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు. లోతట్టు ప్రాంతాల లో ప్రజలను ఎప్పటికప్పు డు అప్రమత్తం చేయాలని సూచించారు. అదేవిధంగా హెచ్చరికలకు అనుగుణం గా పాఠశాలలకు తాత్కా లిక సెలవులను ఇవ్వాల న్నారు.

Related Articles

అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో యోగాంధ్రా/ పాల్గొన్న ఎంపీ హరీష్

యోగాంధ్రా తో ప్రపంచం చూపు ఆంధ్రా వైపు… మార్క్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్టా : ఎంపీ హరీష్ బాలయోగి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 21: […]

మంత్రులకు ర్యాంకులు. సీఎం చంద్రబాబుకు 6 నెంబర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ ఫిబ్రవరి 06:డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వేగుళ్ళ లీలాకృష్ణ

రైతులకు అండగా ఉంటాం.నీటి పారుదల వ్యవస్త ఆధునీకరణకు కృషి: వేగుళ్ళ లీలాకృష్ణ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వేగుళ్ళ లీలాకృష్ణ…. V9 ప్రజా ఆయుధం దినపత్రిక […]

కోడి పందాలకు బరి సిద్దం అంతా మామూలే: నిర్వాహకులు ధీమా!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి జనవరి 11:సంక్రాంతి పండగకు కోడిపందాలు నిర్వహించకూడదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఎస్పీ లు ఆదేశాలు జారీ చేశారు.ఆ […]