

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 25:

మద్యం కావాలి అనుకున్న వారు క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు శనివారం అమలాపురం పట్టణం మద్యం షాపు వద్ద కూటమి నాయకులతో కలిసి కల్తీ మద్యం పై అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ .. పబ్బం గడుపుకుంటున్నారు అన్నారు. మద్యం కల్తీ వ్యవహారం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకమైన కుట్రలో భాగమన్నారు. వైసీపీ నాయకుడు జోగు రమేష్ చిన్ననాటి స్నేహితుడు సురేష్ ద్వారా కల్తీ మద్యం తయారుచేసి, అమ్మించి, తిరిగి ఎక్స్చేంజ్ అధికారులకు ఫోన్ చేసిన సంగతి అందరికీ తెలిసిపోయిందని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సింగ్ ఆపరేషన్ కుట్రను తిప్పుకొట్టి , ప్రజల ఆరోగ్యాన్ని క్యూఆర్ కోడ్ యాప్ ద్వారా కూటమి ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఈ మద్యం విషయంలో మీ గవర్నమెంట్ కు మా గవర్నమెంట్ కు ఎంత తేడా! ఉందో ప్రజలకు అర్థమవుతుంది అన్నారు. అదేవిధంగా నీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు బెల్ట్ షాపులను అమల చేసిన ఘనత నీకే దక్కింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులు గవర్నమెంట్ కి ఇచ్చినట్లు ఇచ్చి , మద్యం అమ్మకాన్ని, అకౌంట్స్ చూసేందుకు మీ వైసీపీ కార్యకర్తలను పెట్టించుకుని, రాత్రి సమయంలో ఇంటింటికి మద్యాన్ని అమ్మించి , కుటీర పరిశ్రమగా తయారుచేసిన ఘనత నీదేనంటూ…ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు వివరిస్తూ.. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం లేనేలేదని అవసరమైతే కాకినాడ ల్యాబ్ కు తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు అని ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నాయకులను, జగన్మోహన్ రెడ్డి ను ఉద్దేశించి మాట్లాడి, మాటల తూటాలతో వైసీపీ పార్టీ పై విరిసికిపడ్డారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పిచ్చెట్టి చంద్రమౌళి , మాజీ ఎంపీపీ బోర్ర ఈశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పాలమూరు ధర్మ పాల్ ,ఈతకోట నాగేశ్వరరావు,మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
