బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన బాధిత 10 కుటుంబాలకు 15 లక్షలు చొప్పున ఎక్స్-గ్రేషియా

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం అక్టోబర్ 24:

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురు పాక శివారు వి సావరం శ్రీలక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్వ ర్క్స్ నందు ఈ నెల 8న జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన బాధిత 10 కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి రూ 15 లక్షలు చొప్పున ఎక్స్-గ్రేషియాను రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శాసనస భ్యులు వేగుళ్ల జోగేశ్వర రావు నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డిలు పంపిణీ చేశారు.

శుక్రవారం కొమరిపాలెం పంచాయతీరాజ్ కళ్యాణ మండ పంలో నిర్వ హించిన ఎక్స్ గ్రేషియా చెల్లింపు పంపిణీ కార్యక్రమంలో మంత్రి వర్యులు మాట్లాడుతూ బాణా సంచా ప్రేలుడు ప్రమాదంలో మరణించిన వారు అత్యంత పేదకుటుంబాల వారని, కూటమి ప్రభుత్వం వారి యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాల ఆదుకోవాలని సంకల్పంతో కార్మిక సంక్షేమ శాఖ ద్వారా ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను అందించడం జరిగిం దన్నారు..

అదేవిధంగా మరణించిన వారిలో ఎనిమిది మంది బాధితులకు తెలుగుదేశం సభ్యత్వం ఉన్నందున ఒక్కొ క్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం కూడా అందు తుందన్నారు. ఈ సంఘటనలో 10 మంది మృత్యు వాత పడ్డార న్నారు. ఈ సంఘటనపై పలు ఆరోపణలు ఎదురైనప్ప టికీ వాటిపై విచారణ చేపట్టి ప్రేలుడు వలన మాత్రమే ప్రమాదం సంభవించిందని నిర్ధారిం చారన్నారు. పేలుడు వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కార్మిక సంక్షేమ శాఖ నుండి కేటాయిం చడం జరిగిందన్నారు.

ఏపీ దుకాణాలు, సంస్థల చట్టం కింద నమోదైన సంస్థల్లో పనిచేసే కార్మికులకు కార్మిక సంక్షేమ మండలి నందు రూ.100 వంతున వెల్ఫేర్ ఫండ్ చెల్లిం చడం జరుగుతుంద న్నారు. యజమాని వాటా రూ.70, కార్మికుని వాటా రూ.30 చొప్పున చెల్లిస్తారన్నారు దీని ద్వారా సంక్షేమ పథకాలు అందించే వారని అయితే ప్రస్తుతం ఈ పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవతో రాయవరం ఘటన బాధితులకు రూ.కోటి 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి వర్యులు తెలిపారు.

బాధిత కుటుం బాలకు మంత్రివర్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడు తూ లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ యజ మాని బాధిత కుటుంబాల వారికి ఒక్కొక్కరికి రూ.2 .50 లక్షల చొప్పున నష్ట పరిహారంగా ప్రకటించారన్నారు. శాసనస భ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ జిల్లా యంత్రాంగం ప్రమాద సంఘటన పట్ల సత్వర మే స్పందించి సహాయక చర్య లు చేపట్టిందన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్డిఓ దేవరకొండ అఖిల, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

భారతీయుల కోరిక ఉగ్రవాదం నశించాలని: ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఢిల్లీ మే 26: గయానా దేశంలో అఖిల పక్ష బృందానికి ఘన స్వాగతం పలికిన భారతీయులు… గయానా దేశ ఉపాధ్యాక్షులు భారత్ జిగ్డియో తో […]

మిరపకాయ్ తో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్

క్యాప్సికమ్ నుక్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, […]

కోడిపందాలు గుండాట పై ఉక్కు పాదం:ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ

కోడిపందాలు గుండాట మరియు రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతులు లేవని ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అయినవిల్లి మండలం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ హెచ్చరించారు.శనివారం ఆమె అయినవిల్లి పోలీస్ అధికారి మరియు రెవెన్యూ […]

పుదుచ్చేరి, కరైకల్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ (జేఐపీఎంఈఆర్) టీచింగ్ పోస్టుల భర్తీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 21: JIPMER Recruitment Notification: పుదుచ్చేరి, కరైకల్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీసెర్చ్ […]