త్రి రత్న బౌద్ధ ధమ్మ సొసైటీ లోగో ఆవిష్కరించిన అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 24:

త్రి రత్న బౌద్ధ ధమ్మ ఏపీ సొసైటీ లోగో ను అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు చేతులు మీదగా శుక్రవారం

త్రి రత్న బౌద్ధ ధమ్మ సొసైటీఏపీ సంస్థ ప్రెసిడెంట్ మరియు బీమగాన కళా రత్న అవార్డు గ్రహీత ఉపాసక గిడ్ల వీర ప్రసాద్ ఆధ్వర్యంలో లోగో మరియు వివాహ అధికార సర్టిఫికెట్ ను గౌరపదంగా భక్తిశ్రద్ధలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ… బౌద్ధ ప్రధమ గురువు గౌతమ బుద్ధుడు ద్వారా మానవాళికి అందించిన పరమార్ధం గొప్పదన్నారు. ప్రపంచ మేధావి బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుని గురువుగా స్వీకరించడం గొప్ప విశ్వేషం అన్నారు. అంబేద్కర్ జీవిస్తున్నప్పుడే బోదిసత్వ బిరుదు అందుకున్నారన్నారు.బోధిసత్వ అంటే సకల జీవుల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి అని అర్థం. ఆయన తన జీవితకాలంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఎంతో కృషి చేశారు అని ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ను ఎమ్మెల్యే కొనియాడారు. భారతరత్న అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధ మత సంప్రదాయ సాధారణ వివాహాలు, జరుపుకోవటం నేటి తరానికి మార్గమన్నారు. గౌతమ బుద్ధుడు భర్తలు తమ భార్యలను గౌరవించాలని, విశ్వాసపాత్రంగా ఉండాలని మరియు గృహ వ్యవహారాలలో అధికారాన్ని పంచుకోవాలని గౌతమ బోధించారు అని అన్నారు. అదేవిధంగా.. బౌద్ధమతంలో వివాహల విషయంలో అంబేద్కర్ చేసిన సూత్రాలు పాటించాలన్నారు. కుల రహిత వివాహాలు జరగాలన్నారు. బౌద్ధమతంలో కుల వ్యవస్థ ఉండకూడదని, కులంతో సంబంధం లేకుండా ఏ వివాహమైన చెల్లుబాటు అవుతుందని ఆయన సూచించారని చెప్పుకొచ్చారు. హిందూ కోడ్ బిల్లుపై చర్చ సందర్భంగా వివాహాలలో కులం లేదా ఉప కులం పరిగణలోనికి తీసుకోబడదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారని ఎమ్మెల్యే ఆనందరావు గుర్తు చేశారు. లోగో మరియు పౌర రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నేడు ఆవిష్కరించడం సంతోషకరంగా ఉందని శాసనసభ్యులు ఆనందరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవ్వా భూషణం , పెయ్యిల దుర్గాప్రసాద్, ఎన్ విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా మరియు మాజీ ప్రజా ప్రతినిధి పెచ్చెట్టి విజయలక్ష్మి,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి పాలమూరు ధర్మ పాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

వన మహోత్సవం/పర్యావరణ సమతుల్యతను కాపాడాలి: అమలాపురం ఆర్డీవో మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 05: పర్యావరణ సమతుల్యతను జీవవైవిద్యాన్ని కాపాడటానికి నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమం వన మహోత్సవ కార్యక్ర మమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి […]

కొండుకుదురు గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు .

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సు కు తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ హాజరైయ్యారు.ఆమె […]

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సమక్షంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం ఆగస్టు 07: చేనేత రంగానికి జవసత్వా లు తీసుకుని వచ్చి పూర్వ వైభవం సంతరింప జేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల […]

హెచ్ ఐ వి /ఎయిడ్స్ మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 12: హెచ్ ఐ వి /ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా పెంచు కుందాం మరియు డ్రగ్స్ రహిత సమాజాన్ని […]