సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది. పుష్ప2′ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయట పడ్డారు.
దీంతో కోర్టులో దాఖలైన రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన కోర్టు ఇవాళ 50₹వేలు పూచికత్తు తో రెగ్యూలర్ బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది.