

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 01:

నివాళులు అర్పించిన మంత్రి,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ…

లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74 వ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ఘనంగా నిర్వహించారు.ఉదయం తమ నివాసంలో పూజా కార్యక్రమం నిర్వహించిన ఎంపీ అనంతరం స్వగ్రామమైన ఎదుర్లంక గ్రామంలో జరిగిన బాలయోగి జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

బాలయోగి విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి అర్పించారు.స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.అనంతరం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అక్కడనుండి ఎదుర్లంక హైవే పై ఉన్న బాలయోగి విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్,మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానందతో నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేశారు.అలాగే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

అనంతరం అమలాపురం బాలయోగి ఘాట్ కు చేరుకుని బాలయోగి విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు,రెడ్డి అనంతకుమారి,రెడ్డి సుబ్రహ్మణ్యం,మెట్ల రమణబాబు లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం స్థానిక జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ హరీష్ బాలయోగి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.