
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు, ఆగస్ట్ 17 :
రవాణా శాఖ రీజినల్ జాయింట్ కమీషనర్ వడ్డీ సుందరం ను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక నాయకులు సత్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లి గ్రామంలో వడ్డీ సుందరంను కల్సిన దళిత చైతన్య వేదిక నాయకులకు ఆయన సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 7 జిల్లాల రవాణా శాఖ రీజినల్ జాయింట్ కమీషనర్ అయ్యిన వడ్డీ సుందరంను దళిత చైతన్య వేదిక నాయకులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి, తలపై నీలి కీర్తి కిరీటాన్ని అలంకరించి, బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు మాట్లాడుతూ నిస్వార్థంగా సమాజానికి వడ్డీ సుందరం చేసిన పలు సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. జిల్లెళ్ళ వినోద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్న వడ్డీ సుందరం ఇంకా ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. తదుపరి దళిత చైతన్య నాయకులనోద్దేశించి వడ్డీ సుందరం మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశ్యం లేకుండా నేనొచ్చిన సమాజానికి వీలైనంత సేవా చేయ్యడమే తన లక్ష్యం అన్నారు. మట్టా సురేష్ కుమార్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ చింతా శ్రీను, ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి, మండల అధ్యక్షులు మందపాటి మధు సభ్యులు మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, పొన్నమండ శేషు, డాక్టర్ బాబు, బొడ్డపల్లి ప్రసాద్, చింతా అరుణ్ కుమార్, పొలుమూరి శరత్, పోతుమూడి రవి కుమార్, గోగి మోహన్ తదితరులు పాల్గొన్నారు.