రైతులకు పవర్ టిల్లర్లు, రోటవేటర్ లను పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం/ద్రాక్షారామ, ఏప్రిల్ 30,2025

వ్యవసాయం లాభదాయకంగా మారాలంటే వ్యవసాయంలో సాంకేతికత అనుసరణ తప్పనిసరిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ పేర్కొన్నారు.


బుధవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ మార్కెట్ యార్డు వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న కాలంలో వ్యవసాయం చేయడానికి సరిపడా మానవ శక్తి అందుబాటులో ఉండదని.. అందుకే వ్యవసాయంలో యాంత్రికరణ అవసరమన్నారు. రైతు చేతిలో శక్తివంతమైన సాధనాలు ఉంటేనే శ్రమను తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యవసాయంలో ఉపయోగించే యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుందన్నారు.

అనంతరం ద్రాక్షారామ గ్రామ సచివాలయం-2 లో బీసీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా 50 మంది మహిళలు లబ్ధి పొందనున్నారని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

శానపల్లిలంక వద్ద రైల్వే లైన్ ను పరిశీలించిన MP MLA హరీష్ బాలయోగి/గిడ్డి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 20: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద కోనసీమ రైల్వే లైన్ […]

కోనసీమ రైల్వే లైనుకు మార్గం సుగమం/ఎంపీ హరీష్ హర్షం

భూసేకరణ ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను తొలగించిన హైకోర్టు… హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి… కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను మార్గం పూర్తిచేయడానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగతుండటంతో కోనసీమ రైల్వే లైన్ […]

340 ప్రభుత్వ ఉద్యోగాలు//రేపు ఇంజనీర్ పోస్టులకు అమలాపురంలో రాత పరీక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 24: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈనెల 25వ తేదీ మంగళవారం సహాయ పర్యావరణ ఇంజనీర్లు పోస్టుల భర్తీకి కంప్యూటర్ […]