రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 16:

వాతావరణ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ స్పందన సంస్థ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం జిల్లా కలెక్టర్ జిల్లాస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోనసీమ జిల్లాలోని డ్రైన్లు కాలువల గట్లు పూడికలు తొలగిం చాలని సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వివరాలు తెలుసుకోవాలని వెనుకకు రప్పించాలని, అదేవిధంగా రానున్న రెండు రోజులు మత్స్యకారులు ఎవరు సముద్రంపై వేటకు వెళ్ళ రాదని సూచించారు. కోనసీమ జిల్లాలోని ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే బయటకు రావాలని అదేవిధంగా ఎటువంటి ప్రయాణాలు చేయరాదనీ ప్రజానీకానికి తెలియజే యాలన్నారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నందు 08856 293104 ఫోను సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందనీ అత్యవసర పరిస్థితులలో ఈ నెంబర్లో సంప్రదించి సహాయం కోరవ చ్చునన్నారు డివిజన్లో స్థాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని పాఠశా లలో భవన స్థితిగతులను పరిశీలించి శిధిలావస్థలో ఉన్న ఎడల అవసరమైతే మరియొక పాఠశాలకు విద్యార్థినీ విద్యార్థులను తరలించాలని ఆదేశించారు అందరూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని రెవిన్యూ పోలీస్ ఎలక్ట్రికల్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా తగు చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Related Articles

పరిష్కార వేదిక/1100 కాల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 25:ఈ నెల మే 26 వ తేది సోమ వారం ఉదయం 10 గంటల నుండి స్థానిక కలెక్టరేట్లో గోదావరి భవన్ […]

ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర తీరం వెంబడి ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికి […]

రాగి జావ పుడ్ పాయిజనింగ్. విధులు నుండి తప్పించిన డీఈవో

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 25: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం జగ్గారాజు పేట మండల పరిషత్ ప్రాథమిక […]

246 కోట్లతోరామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి

మరో రూ.123 కోట్లతో ప్రతిపాదనలు డ్వాక్రా సంఘాలకు రూ.116 కోట్లు పంపిణీ పార్టీలకు అతీతంగా సంక్షేమం అమలు మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం, […]