
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కొత్తపేట ఆగస్టు 16:
కొత్తపేట RS బీసీ కన్వెన్షన్ హాల్ నందు సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి వేడుకలు శనివారం మండల శెట్టిబలిజ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, సంఘ ప్రతినిధులు గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల శెట్టి బలిజ సంఘ అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ,ప్రధాన కార్యదర్శి గుబ్బల సత్తిపండు, ట్రెజరర్ కుడుపూడి వెంకటేశ్వరావు, బొంతు గౌరి శంకర్,బొక్కా సుబ్రహ్మణ్యం,కుడుపూడి వెంకటేశ్వరావు, ముసిని వెంకటరమణ,యనమదల శ్రీనివాసరావు,కడలి భీమరాజు,యనమదల వెంకటేష్, కముజు తాతాజీ,కొప్పిశెట్టి వెంకటేశ్వరావు,దూనబోయిన ప్రదీప్, దంగేటి సాయి, కొప్పిశెట్టి శ్రీరామ్, సూరంపూడి వినయ్,గుత్తుల భవానీ శంఖర్,దoగేటి జయ శివనారాయణ,వాసంశెట్టి ఆంజనేయులు, ఇళ్ళ మూర్తి,తదితరులు పాల్గొన్నారు.