
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 23:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి క్వాయర్ అధ్యయన బృందం శుక్రవారం కోయంబ త్తూరు సమీపంలోని తిరు పూరు లో కొబ్బరి, క్వాయర్ ఉత్పత్తుల ఎఫ్ ఎక్స్ ఫ్యాక్టరీ ను సందర్శించి స్థానికంగా సుమారుగా 30 ఉత్పత్తుల తయారీ విధానాలను అధ్యయనం చేశారు.

ఈ కార్యక్రమం లో ఎఫ్ ఎక్స్ ఫ్యాక్టరీ వ్యవ స్థాపకులు నిర్వాహకులతో సమావేశమై వర్జిన్ కోకోనట్ ఆయిల్ కోకో ఫిట్, మెన్యూర్ తదితర 30 ఉత్పత్తుల తయారీ విధానాలను కూలంకశoగా అడిగి తెలుసు కున్నారు. స్థానికంగా ఈ యొక్క బై ప్రోడక్ట్స్ విలువ ఆధారిత పరిశ్రమలు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పరిచి జీవ నోపాదులు పెంపొందించగలవని బృందం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకే పీ ప్రసాద్ డి ఆర్ డి ఏ. పి డి సాయినాథ్ జయచంద్ర గాంధీ, ఏ పీ ఐ సీ సీ జోనల్ మేనేజర్ రమణా రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవ వర్మ, జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ తదితరులు పాల్గొన్నారు