V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం,డిసెంబర్ 16: అనారోగ్యంతో బాధపడుతున్న, నిరుపేద కుటుంబానికి చెందిన రామచంద్రపురం తొరంవారి వీధికు చెందిన మచ్చా వీరభద్రరావుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. సోమవారం రామచంద్రపురం లోని మంత్రి గృహానికి వచ్చిన వీరభద్రరావు భార్య దేవి తన భర్త క్యాన్సర్ వ్యాధితో పలు ఇబ్బందులు పడుతూ,అనారోగ్యంతో మంచానపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తక్షణం స్పందించిన మంత్రి సుభాష్ తన సొంత నిధులను హెచ్చించి రూ. 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మంచి వైద్యం అందించి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. మానవతా దృక్పథంతో మంత్రి సుభాష్ స్పందించి ఆర్థిక సహాయం అందించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
క్యాన్సర్ బాధితునికి మంత్రి సుభాష్ రూ. 20 వేలు ఆర్థిక సహాయం
December 16, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తాం
ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేంకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని వెల్లడించారు. భారతీయ భాషల పుస్తకాలకు డిజిటల్ రూపం […]
రైల్వే NTPC గ్రాడ్యుయేట్ ఉద్యోగ నోటిఫికేషన్ – 2025
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -జూలై 22: సంస్థ: భారత రైల్వేనోటిఫికేషన్: CEN No. 03/2025 – 04/2025 పోస్టులు: మొత్తం ఖాళీలు: 30,307 వయసు పరిమితి: 18-36 ఏళ్లు […]
కొనుగోలు చేసిన వస్తువులకు రసీదు తీసుకోవడం మంచిది: జాయింట్ కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 24: నేటి ఆధునిక కాలం లో వస్తువు, మరియు సేవల వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు కు రసీదు తీసుకోకపోవడం వంటి […]
ప్రతి అక్షరం ప్రజా ఆయుధం
V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా