పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-4 అధక లక్ష్యం/ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 15:

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-4 అధక లక్ష్యమనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఆర్థిక గణాంక శాఖ అధికారులు డిఆర్డిఏ, డ్వామా, జి ఎస్ డబ్ల్యూ ఎస్ సిబ్బంది విజన్ డాక్యుమెంట్ యూనిట్ సిబ్బందితో పి ఫోర్ పథకం అమలు తీరుపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సంప్రదింపుదారులు అవగాహన సమావేశాన్ని పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా నిర్వహించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదవారిని ఆర్థిక సామాజిక రంగాల్లో తీసుకొచ్చే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహి స్తోందన్నారు పేదలను ధనికులను భాగ స్వామ్యం చేసేందుకు ఈ విధానం ఎంతగానో ఉప యోగపడు తుందని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన పి 4 (ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగ స్వామ్యం) లక్ష్యంమేరకు గ్రామాలలో బాగా వెనుక బడిన వారి గుర్తించివారి అభ్యున్నతికి అభివృ ద్ధి చెందిన వారి ద్వారా సహాకారం అందించి లబ్ది చేకూరే పనులు చేపట్ట డంలో ప్రతి అధికారి బాధ్యతా యుతంగా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. పేదరిక నిర్మూలనకు రెండు ప్రాథమిక మార్గాలని ఒకటి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం రెండోది అవసరానికి నిధులు సమ కూర్చడం అన్నారు ఒక కుటుంబాన్ని దీర్ఘకాలిక మార్గదర్శకత్వం ఆర్థిక సహాయం అందించి స్వయం సమృద్ధి వైపు నడిపించి విద్య ఉపాధి హార్దిక స్థిరత్వంలో వారికి మార్గ నిర్దేశం చేయా లన్నారు. దీర్ఘకాలిక నిబద్ధత లేకుండా వ్యక్తిగత కుటుంబ గ్రామస్థాయిలో ఒక నిర్దిష్ట అవసరాన్ని తీర్చడానికి ఒకేసారి ఆర్థిక సహాయం అందించాలన్నారు. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికే ఈ పథక రూపకల్పన జరిగిందన్నారు.

20 శాతం అట్టడుగు కుటుంబాల వివరాలు తీసుకొని సమా జంలో పది శాతం ఉన్నత స్థాయిలో ఉన్న వారి సహ కారంతో వారి ఉన్నతికి చేయూతనివ్వడం జరుగుతుందన్నారు రెవిన్యూ జనరేషన్కు దోహదపడుతుంద న్నారు. సర్వేలో సిబ్బంది పొందుపర్చే అంశాలు ప్రస్తుత జీవనశైలిలో భాగమేనని. స్మార్ట్ ఫోన్లు, బైకులు ఇలాంటి ప్రశ్నలు ఉండడంతో సంక్షేమ పథకాల్లో కోతపడుతుందని ఆందోళన ప్రజల్లో నెలకొంద. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యధావిధిగా కొనసాగుతాయని పి 4 లబ్ధిదారులకు దాతలు ఇచ్చే చేయూత అదన మన్నారు. జీరో పేదరికాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం యొక్క కార్యక్రమానికి భశ్రీకారం చు ట్టిందని ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల బంగారు కుటుంబా లను మార్గదర్శలకు దత్తత నివ్వాలని లక్ష్యంగా నిర్దేశిం చిందన్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 64 వేల బంగారు కుటుంబాలు గుర్తించడం జరిగిందని వీరిని మార్గద ర్శలకు దత్తత ఇచ్చేందుకు అధికారులు సమన్వ యంతో కృషి సల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ మురళీకృష్ణ ఎల్డీఎం కేశవ వర్మ డ్వామా పిడి మధుసూదన్ రావు డిఆర్డిఏ పిడి గాంధీ, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు, ఏపీ డి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Related Articles

ముస్లిం అబ్బాయి రజనీకాంత్ కుమారుడిగా అంగీకరించారు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఆంధ్రప్రదేశ్ జూన్ 01: సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు మహ్మద్ యాసిన్ అనే […]

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిగా శాంతి కుమారి బాధ్యతలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 24:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులుగా బి శాంత కుమారి శుక్రవారం […]

అమలాపురం ఏపీఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 16: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో భారీ వర్షాలకు ముందు తీసుకుంటున్న ప్రాథమిక చర్యలను తెలియజేస్తోంది. సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. […]

ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 8: ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అం దిన భూ సంబంధిత ఫిర్యా దులు పరిష్కారం. రీ […]