
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 19:
పోలీసు అధికారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పరామర్శించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఏఎస్ఐ జంగా సత్యనారాయణ తల్లి విమల 85 ఇటీవల మరణించారు.కన్నతల్లి దూరమైన బాధలో ఉన్న పోలీసు అధికారి సత్యనారాయణ ను శనివారం అమలాపురం చిందాడగరువు గ్రామం ఆయన స్వగృహం నందు కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ తండ్రి మాజీ సర్పంచ్ జంగా రాజారావు, మరియు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి ఓదార్పు మాటలను ఉచ్చరించారు. మరణం అందరికీ సమానమే కానీ వారి జ్ఞాపకాలు గుర్తులుగా మిగిలిపోతాయని ఎమ్మెల్సీ ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో ముందుగా రిటైర్డ్ మండల విద్యాధికారి జంగా రాజేంద్రకుమార్ స్థాపించిన అమ్మా వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సందర్శించారు. పేద కుటుంబాలకు మంచినీళ్లు అందరికీ అందించాలనే మంచి భావన మనసుకు రావడం దైవ కృప అని ఎమ్మెల్సీ అభివర్ణిస్తూ.. రాజేంద్ర కుమార్ ను అభినందించారు.