

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 19:

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆ దిశగా పౌరులు చైతన్యవంతులు కావాలని అంబేడ్కర్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.. శనివారం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రైతు బజార్ నిర్వహణ అంశాలు మరియు ప్లాస్టిక్ కు బదులు ఇతర ప్రత్యామ్నాయ సంచులు వినియోగం షాపును ఆయన పరిశీ లించారు.

అనంతరం ప్లాస్టిక్ కాలుష్యం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ చర్య లలో ఆయన పాల్గొని మాట్లా డుతూ గత ఆరు మాసాలుగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం మరింత ఉత్సా హంగా సాగుతోందన్నారు. ప్రతి నెల మూడవ శనివారాన్ని ఈ కార్యక్రమానికి కేటాయిస్తు న్నారనీ. ప్రతి సారి ఒక కొత్త ఇతివృత్తంతో ప్రజలలో అవ గాహన పెంచే విధంగా దీనిని కొనసాగిస్తున్నారన్నారు. తాజాగా జూలై నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్య క్రమం “ప్లాస్టిక్ కాలుష్యం అంతం “అనే ఇతి వృత్తంతో స్వర్ణాంధ్ర – 2047” లక్ష్యా న్ని చేరుకో వడంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్య క్రమాన్ని నిర్వ హించామన్నారు.

ప్రతి కార్యక్రమం ప్రేర ణాత్మకంగా ఉండేందుకు ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని తీసుకుంటున్నామని తెలిపారు.ప్లాస్టిక్ కాలు ష్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ముందుగా ప్రతి కార్యాలయం సంస్థల లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరి గిందన్నారు. సర్క్యులర్ ఎకానమీ సాధించాలంటే ఈ-వేస్ట్ సేకరణ, సరైన రీసైక్లింగ్ చాలా అవసరమన్నారు.జిల్లా యంత్రాం గంప్రజా ప్రతినిధులు విద్యా ర్థులు, యువతతో పాటు ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛం దంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. . వ్యర్ధాల రీసైకిలింగ్ అనే నినాదం ప్రతీ పౌరుని ప్రేరేపించేలా ఉండాలని, ఈ కార్యక్రమం ద్వారా ఒకవైపు పర్యావరణాన్ని కాపాడు తూనే ,మరోవైపు ఆధునిక సాంకేతికత, ఉత్ప త్తుల వ్యర్థాల నిర్వహణకు సమర్థమైన పరి ష్కారాన్ని అందిస్తుందన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేవలం ఒక రోజు కార్యాచరణ కాదనీ, ఇది మంచి ఆలోచన తో జీవనశైలిలో మార్పుకు నాంది పలుకు తుందన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ మన స్ఫూర్తిగా స్వీకరించి, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాముల వ్వాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణపై విస్తృత ప్రచారం గావించడంతోపాటు వివిధ పరిశుభ్రత అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందనీ. ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్య మని ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా చూ డాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులు ఇతర ప్రత్యా మ్నాయ సంచులను తప్పని సరిగా వినియోగించి ప్లాస్టిక్ కాలు ష్యాన్ని నియం త్రించాలన్నారు కూరగాయలు పండించే రైతులకు సరసమైన గిట్టు బాటు ధరలు లభించడం తోపాటు వినియోగదారుల కు తాజాగా అందుబాటు ధరలలో కూరగా యల విక్రయించాలని సంక ల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారం భించిన ఒక సామాజిక సేవా కార్యక్రమం రైతు బజారని వెల్లడించారు. రైతు బజార్ నందు రైతులతో ఆయన ముచ్చ టిస్తూ కూరగాయలు ఎక్కడ పండిస్తున్నారు ఏ సమయానికి రైతు బజార్ కి వస్తున్నది విక్రయ లావాదేవీలు రైతు బజార్ ఫంక్షన్ లపై ఆరా తీశారు. కూరగాయలు నిత్యవసర వస్తువుల నాణ్య తలను ఆయన స్వయంగా పరిశీలించారు రైతులు తమ ఉత్పత్తులను మధ్య వర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించ డంలో సహాయం చేయడం రైతు బజార్ యొక్క ప్రధాన ఉద్దేశ్య మన్నారు రైతు బజారును సాంప్రదాయ మార్కెటింగ్ మార్గంలో అటు ఉత్పత్తి దారులకు ఇటు వినియో గదారులకు మేలు జరిగేలా సమన్వయంతో నిర్వహించేలా ఎస్టేట్ అధికారి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతి షాప్ ముందు ధరల సూచిక పట్టికలను ప్రదర్శించాలన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా మార్కె టింగ్ శాఖ అధికారిని కే విశాలాక్షి, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఎస్టేట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.