
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 16:
ఏలూరు జిల్లా భీమవరం లో మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వడ్డేపల్లి రామచంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక కు చెందిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆకుమర్తి బేబీ రాణి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాలు సమస్యలు అవగాహన పై కొంతసేపు చర్చించారు. బేబీరాణి, చైర్మన్ రామచంద్రరావుకు ఎస్సీ కుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లి, త్వరగా పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరారు.జాతీయ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దళిత బిజెపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.