
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జనవరి 04:

ముమ్మిడివరంలో కిషోరి – వికాసం ట్రైనింగ్ ప్రోగ్రాం సమావేశం.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ముమ్మిడివరం సిడిపిఓ ఐ.విమల అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, కౌమార దశ, సంరక్షణ, ఆరోగ్యం పోషకాహారం, లింగ వివక్షత, నైపుణ్యం ఉపాధి, నాణ్యమైన విద్య, ఆత్మరక్షణ, లైంగిక వేధింపులు,వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో, ఎంఈఓ, మున్సిపల్ కమీషనర్, సెర్ఫ్ సిబ్బంది, గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్, ఐసి పిఎస్ – డి సి పి యు సిబ్బంది ఎం. మహాలక్ష్మణ్, సూపర్వైజర్లు, టీచర్లు, మరియు సా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
