
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం జూలై 13:

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆదివారం ప్రారంభించారు.నగర పంచాయతీ పరిధిలోని 25 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో రాజుపాలెం నుండి మట్టాడిపాలెంకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును అలాగే మరో 25 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో కాశీవారితూము నుండి చింతలమెరకకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును నిర్మించామన్నారు.అలాగే నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే బుచ్చిబాబు లు తెలిపారు.