


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 11:

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన వారికి చేయించుకున్నవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం లింగ నిర్ధారణ నిషేధత చట్టం – 1994 అమలుపై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అధారిటీ సలహాకమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ గర్భస్థ శిశువును కాపాడా ల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ, రెవిన్యూ, పోలీస్, అధికారులు సమ న్వయంతో పనిచేసి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పటిష్ట అమలుకు పటిష్టమైన చర్యలు చేపట్టా లన్నారు. పీసి పీఎన్ డిటి చట్టం అమలుతీరు, స్కానిం గ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ రె న్యూవల్, డెకాయ్ ఆపరే షన్లు, ఆకస్మిక తనిఖీలను ఎన్ జి వోల ప్రతినిధుల సమన్వయంతో సంబందిత అధికారులు ముమ్మరం చే యాలన్నారు..జిల్లాలో గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లలో ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు ఉపయోగిం చుకోవడం చట్టరీత్యా నేరమని నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానిం గ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వారిపై చట్టప రమైన చర్యలు తీసుకోవాలన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహిం చినా చర్యలు చర్యలు తీసు కోవడం జరుగుతుందని
లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరిం చారు. సమాజంలో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమేనని దేనిలోనూ తక్కువ కాద న్నారు. పుట్ట బోయేది ఆడ శిశువు అని తెలియగానే కొన్ని సంద ర్భాల్లో భ్రూణ హత్యలు, గర్భస్రావానికి సిద్ధపడు తున్నారని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లింగ ఎంపిక నిషేధ చట్టం తీసుకువచ్చి కట్టుదిట్టమైన చర్యలు గైకొనడం జరుగు తుందన్నారు. గర్భస్రావాల జరిగిన సందర్భంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు.డేకాయ్ ఆపరేషన్లు నిర్వహించి విచారణ చేసి, రుజువైతే ఆయా స్కానింగు సెంటర్లను సీజ్ చేసి, జరిమానాలు శిక్షలు విధించాలన్నారు
లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, చేయించుకోవ డం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ లింగ ఎంపిక నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లి ష్మెంట్ యాక్టుపై సమీక్షిం చారు లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమన్నారు . పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలియజే యకూడదని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించు కున్న వారు శిక్షార్హుల న్నారు జిల్లాలో భ్రూణ హత్యలు ఆపేద్దాం ఆడపిల్లలను రక్షించు కుందాం అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించాల న్నారు క్రొత్తగా స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన ప్రతిపాదనలలో అన్ని సౌకర్యాలు కలిగిన స్కానింగ్ సెంటర్లకు అను మతులు జారీ చేయాలని తెలిపారు. జిల్లాలోని క్లిని కల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకా రం అన్ని కేంద్రాలలో డేకాయ్ ఆపరేషన్లు నిర్వ హించి లింగ నిర్ధారణ చేస్తున్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు గైకొనాలన్నారు. మూడు కొత్త అల్ట్రా స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లకు రెండు కేంద్రాల రెన్యువల్ కు మూడు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల ఆధునీకరణకు ఒక కేంద్రం మూసివేతకు కమిటీ సభ్యులు అనుమతితో జిల్లా కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్వో ఎం దుర్గా రావు దొర, అదనపు డిఎం హెచ్ ఓ, భరత లక్ష్మి అదనపు జిల్లా ఎస్పీ ప్రసాద్, డి ఐ ఓ సత్య నారాయణ ఐ సి డి ఎస్ పి డి శాంత కుమారి, డి ఐ పి ఆర్ ఓ సిహెచ్ శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నా రు