అరటి నారతో ఖరీదైన వస్తువులు తయారీ కేంద్రం ఆసక్తికరంగా అమలాపురం కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24

అరటి ఫైబర్ యూనిట్లు స్థాపించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారీ ద్వారా స్థానిక ప్రజానీకానికి జీవనో పాదులు మెరుగుపరచాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఉద్యాన, పరిశ్రమల కేంద్రం అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరంలో అరటి నార ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను సందర్శించి, అరటి నార ఆధారిత చేతివృత్తి ఉత్పత్తుల తయారీ ప్రక్రియను స్వయంగా ఉద్యాన అధికారి బి.వి. రమణ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉద్యాన అధికారి రమణ ప్రాజెక్టు గురించి జిల్లా కలెక్టర్ వారికి వివరిస్తూ రావులపాలెం మండలంలో అరటి నార సేకరణ జరుగు తోందని సేకరించిన నార ద్వారా రాజమహేంద్ర వరంలో చేతివృత్తి ఉత్ప త్తుల తయారీ జరుగుతోం దన్నారు. స్థానికంగా అరటి సాగు అవుతున్న రావులపా లెం ప్రాంతంలో అరటి నార ఉత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశాలను అరటి ఫైబర్ పరిశ్రమ సృష్టించగలదన్నారు

కోనసీమ జిల్లాలో సుమారు 24వేల ఎకరాలలో అరటి సాగు జరుగుతోందని. ఒక ఎకరం అరటి సాగు నుండి సుమారు 800–1,000 అరటి బొందలు లభిస్తాయన్నారు ఇవి ఒక్కో చెట్టుకు సుమారు 200 గ్రాముల అరటి నారా మరియు 10 కిలోల వ్యర్థాన్ని ఉత్పత్తి చేస్తాయని. దీని ద్వారా ఒక ఎకరానికి సుమారు 160– 200 కిలోల అరటి నారా సేకరించవచ్చునన్నారు.

ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కిలో నారా ధర సుమారు రూ. 200/- ఉండటంతో, రైతులకు ఒక ఎకరానికి రూ. 32, వేల నుండి రూ. 40వేల వరకు అదనపు ఆదాయం లభి స్తుందన్నారు.అదనంగా, ఒక ఎకరం నుండి లభించే 8–10 టన్నుల వ్యర్థాన్ని పశువుల ఎరువుతో కలిపి నాణ్యమైన వర్మికంపోస్ట్ తయారు చేయవచ్చున న్నారు.పొటాష్ అధికంగా ఉండే ఈ వర్మీ కంపోస్ట్ తయారీ సేంద్రీయ వ్యవ సాయానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. రైతులు ఈ వర్మికంపోస్ట్‌ను తమ సొంత పొలాలలో ఉపయోగించ డం ద్వారా సాగు లో పెట్టు బడి ఖర్చులను తగ్గిం చుకోవచ్చునన్నారు.

లేదా దానిని విక్రయించడం ద్వారా రూ.50 వేల వరకు అదనపు ఆదాయం పొంద వచ్చునన్నారు.ఈ విధంగా, అరటి బొందలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా కోనసీమ జిల్లా రైతులకు గణనీయ మైన ఆర్థిక లాభాలను ఆర్జించడమే కాకుండా గ్రామీణ స్థాయిలో అనేకమందికి ఉపాధి అవకాశాలు గణనీయంగా లభిస్తాయన్నారు. ఈ సందర్శన సందర్భంగా జిల్లా కలెక్టర్ రావులపాలెంలో అరటి నార సేకరణలో మరియు రాజమహేంద్ర వరంలో చేతివృత్తి ఉత్ప త్తుల తయారీలో నిమగ్న మైన యూనిట్ స్థాపకు రాలు కృష్ణవేణి సంప్రదించి వారి ప్రయత్నాలను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఈ రకమైన ఆవిష్కరణలను విస్తరించడం ద్వారా రైతులు మరియు గ్రామీణ కళాకారులను సాధికార పరచాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ నారలను టెక్స్‌టైల్స్, చేతివృత్తి ఉత్పత్తులు, తాడులు, బ్రష్‌లు, కుషన్‌లు వంటి వివిధ ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ పర్యావరణ హిత ప్రక్రియకు కనీస యంత్రాలు కనీస నైపుణ్యం కలిగిన కార్మికులు అవస రమన్నారు, ఈ యూనిట్లు కోనసీమ లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలకు అనువైనవ న్నారు, రైతులకు అదనపు ఆదాయం, సుస్థిరమైన గ్రామీ ణాభివృద్ధిని ప్రోత్స హిస్తుందన్నారు.

అరటి నార సేకరణ యొక్క ప్రయోజనా లు తెలుపుతూ జనపనార కంటే 1.5 రెట్లు ఎక్కువ బలం కలిగినదని,
వ్యర్థాలు లేని పర్యావరణ అనుకూల ప్రక్రియనీ కనీస యంత్రాలు కొద్దిపాటి నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమన్నారు.జీవ అవక్షేపణ ఉత్పత్తుల తయారీ.వ్యవసాయ జీవ వ్యర్థాల తయారీ,అధిక ఎగుమతి సామర్థ్యం కలి గిన కుటీర పరిశ్రమలకు అనువైనదన్నారు.తక్కువ పెట్టుబడి, త్వరిత లాభాలు కలిగి ఉన్న పరిశ్రమన్నారు. అరటి నార గ్రేడ్‌ లు అనువ ర్తనాలు,మృదువైన నార తో సింథటిక్ టెక్నాలజీతో కలిపి కలిపి అలంకారం వస్తువు లు బట్టలు హ్యాంగింగ్స్ టేబుల్ మ్యాట్లు, లేడీస్ బ్యాగ్స్, ఫ్లవర్ వేసెస్, పిల్లల టోపీలు, లాంప్ షేడ్స్ తయారు చేయవచ్చున ముతక నారతో కార్పెట్లు, డోర్‌ మ్యాట్స్, సున్నం/క్లీనింగ్ బ్రష్‌లు, కుషన్ తయారు చేయవచ్చునన్నారు.

Related Articles

ఈదరపల్లి వంతెన ఎగువన దిగువన ఉన్న జంక్షన్ల అభివృద్ధి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 15: ఈదరపల్లి వంతెన ఎగువన దిగువన ఉన్న జంక్షన్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్ […]

శ్రీకాకుళం బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం బారువ 09: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో చేపట్టిన సంక్రాంతి సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి అంటూ ఉపాధ్యాయులను ప్రజా ప్రతినిధులు అభినందించారు. […]

గురుకుల పాఠశాల విద్యార్థులు వద్దకుజిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం డిసెంబర్ 22:ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం ప్రతిరోజు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా […]

నిరుపేదలకు వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ లక్ష్యం: డాక్టర్ కారెం రవితేజ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఉప్పలగుప్తం డిసెంబర్ 30 నిరుపేదలకు వైద్యం అందించడం కోసం మే అమలాపురంలో కోనసీమ కేర్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని చల్లపల్లి గ్రామంలో డాక్టర్ కారెం రవితేజ […]