


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జూలై 07:
ఈఎస్ఐ జంగా సత్యనారాయణకు ఎస్సై తిరుమలరావు పరామర్శ.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ తిరుమల రావు ఈఎస్ఐ జంగా సత్యనారాయణ పరామర్శించారు. సత్యనారాయణ తల్లి విమల (85) అనారోగ్యంతో ఇటీవల మరణించారు. కన్నతల్లి దూరమైన బాధలో ఉన్న ఏఎస్ఐ జంగా సత్యనారాయణ ను సోమవారం ఎస్సై తిరుమల రావు పరామర్శించి ధైర్యపరిచారు. మొదటగా తల్లి విమల చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ యూనియన్ నాయకులు మరియు చింతాడ గురువు మాజీ సర్పంచ్ జువ్వది బుజ్జి, వాసంశెట్టి చిన్నబాబు, శ్రీరాంపురం శతుశ్రీ, రిటైర్డ్ ఎంఈఓ మరియు పొలిటికల్ ఎనలిస్ట్ జంగా రాజేంద్రప్రసాద్, మరియు అల్లవరం ఏఎస్ఐ రెడ్డి , స్టేషన్ పోలీస్ సిబ్బంది తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.