


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 07:

చైర్ పర్సన్ పెనమాల లక్ష్మీ పుట్టినరోజు వేడుకలు విలస లెప్రసీ హాస్పిటల్ లో ఘనంగా జరిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నగరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పెనమాల లక్ష్మీ జన్మదిన వేడుకలు అయినవిల్లి మండలం, మండల జనసేన యువత అధ్యక్షులు కోరపు ఈశ్వర్ ఆధ్వర్యంలో లెప్రసీ ఆసుపత్రి విలస ప్రాంగణం రోగులు మధ్య పుట్టినరోజు కేక్ ను కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కుష్టు రోగులకు మధ్యాహ్నం భోజనాలు సిద్ధం చేశారు. మరియు బ్రెడ్ ,పండ్లు, మినరల్ మంచినీళ్లు బాటిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెనమాల లక్ష్మీ మాట్లాడుతూ… ,మైకోబాక్టీరియం మరియు లెప్రే మైకోబాక్టీరియం అనే వైరస్ బారినపడి ఊరికి దూరంగా ఉంటూ..కుష్టువ్యాధి వల్ల ఎంతో మానసిక శోభ అనుభవిస్తున్న వారికి మనోధర్యం కలిపించలనే ఉద్దేశంతో నా పుట్టినరోజునాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు. యో పాపం తెలియని తల్లిదండ్రులు వయసు ఉన్న వారు మధ్య నా పుట్టిన రోజు చేసుకోవటం ఆనందకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు వీరవల్లిపాలెం గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, విలస గ్రామ ఎంపీటీసీ సభ్యులు కొప్పాల రాంబాబు,కొండకుదురు గ్రామ సర్పంచ్ మేడిది దుర్గాప్రసాద్, అంబటి రాజు, కాకిలేటి సత్తిబాబు,చోడే లోవరాజు, సురేష్, పల్లి బాలకృష్ణ, రాజేష్, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చైర్ పర్సన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.