
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 10:

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మామిడికుదురు అల్లవరం జూలై 10:

సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఐలంగా విశ్వసించి మెగా పిటీఎం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిం దని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు గురువారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలో జూనియర్ కళాశాల మరియు శ్రీ గోక రాజు గణాధిపతి జడ్పిహెచ్ఎస్ పాఠశాల , పేరూరు అక్షర ఇంటర్నేషన ల్ పాఠశాలలో మెగా పిటీఎం కార్యక్రమాలు నిర్వహణ తీరును పరిశీ లించారు.

అదేవిధంగా జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ ల్యాబ్, విద్యా సంస్థలలో వసతులు, మరుగుదొడ్లు ఆరో ప్లాంట్లు నిర్వహణ తీరును తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో నిర్వహి స్తున్న మెగా పేటీఎం కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు ఆదే శాలు జారీ చేశారు. విద్యా ర్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందరూ సమన్వయంతో పాటుపడాలని సూచించారు విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగ స్వామి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అన్నారు పేద రికంలేని సమాజ నిర్మా ణమే ధ్యేయంగా విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి రాబోయే 2047 సంవత్సరాంతానికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించారన్నారు.

ఇందులో భాగంగానే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఆదర్శ వంతంగా నిర్వహించారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశిం చిన కీలకమైన కార్యక్రమన్నారు తల్లిదం డ్రులు తమ పిల్లలు విద్యా పరంగా, ప్రవర్తనా పరంగా ఏ స్థాయి లో ఉన్నారో, సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగా హనా కలిగి ఉన్నారో తెలుసు కోవడం తోపాటు, అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు.
విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యా యులు, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటు న్నారని అంశాలపై మంచి అవగా హన పెం పొందించారన్నారు అదేవిధం గా తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ఒక మంచి వేదికగా పిటిఎం నిలి చిందన్నారు విద్యారంగంలో మరో వినూత్న ముందడుగు పడిందన్నారు జిల్లాలోని విద్యా ర్థుల భవిష్యత్తు మరింత చక్కగా తీర్చిదిద్ద డానికి తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు.

ఈ కార్యక్రమం జిల్లాలోని ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలో ఒక పండగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠ శాలల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచి, విద్యార్థుల విద్యా ప్రగతికి, పాఠశాలల అభివృద్ధికి ఉమ్మడిగాకృషి చేయడమే ప్రధాన లక్ష్యమ న్నారు ఈ సమావేశంలో విద్యార్థులకు గతేడాది ఏం చేశాం, ఈ విద్యా సంవత్సరంలో ఏం చేయబోతున్నామనే భవి ష్యత్కు ఉపయోగపడే విద్యార్థుల ప్రణాళికపై చర్చ జరిగిందన్నారు విద్యార్థులకు విద్యకు సంబంధించిన సమస్యలపై చర్చించి తగు పరిష్కార మార్గాలు చూపారన్నారు .

ప్రతి విద్యార్థి తల్లి పేరున గ్రీన్ పాస్ పోర్టు మొ క్కలు నాటే కార్యక్రమం నిర్వ హించారన్నారు. మొక్క నాట డంతో పాటు ఆరు నెలల పాటు మొక్క సంర క్షణ బాధ్యత తీసుకున్నారన్నారు డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజనం పేరెం ట్స్, టీచర్స్, ప్రజాప్రతి నిధులతో ఒక పండగ వాతావరణంలో కలసి సహపంక్తి భోజనాలు నిర్వహించారన్నారు పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచ డమే లక్ష్యమనీ పేరెంట్ టీచర్ మీటింగ్ ను ప్రధా నోపా ధ్యాయుల ఆధ్వ ర్యంలో నిర్వ హించారన్నారు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాల్లో విద్యార్థుల విద్యా పురోగతిపై, బోధన ప్రమాణాలపై, మౌలిక సదు పాయాల అవసరాలపై తల్లిదండ్రులకు వివరణ ఇచ్చారన్నారు. అలాగే ప్రతి విద్యా సంస్థ తమ కార్యా చరణ ప్రణాళిక, లక్ష్యాలు, అమల వుతున్న పథకాలపై వివరాలను తెలిపారన్నారు తల్లిదం డ్రుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపర్చే లక్ష్యంతో సమావేశాలు జరిగాయన్నా రు.మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోట్ల మందికి పైగా పాల్గొ నేలా చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు గిన్నిస్ రికార్డు సాధన కోసం లీప్ యాప్లో మెగా పీటీఎం 2.0 రిజిస్ట్రే షన్లు నిర్వ హించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలల, ప్రిన్సిపాళ్ళు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదిత రులు పాల్గొన్నారు.