

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూన్ 11:

విద్యా సంవత్సరం ప్రారం భమవుతున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులు ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిధిలోని ఠాణేలంక గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించి ఇటీవల చేపట్టిన అభివృద్ధి మరమ్మత్తు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పర్యటనలో భాగంగా గురుకుల పాఠశాలను సందర్శించిన సమయం లో పలు పనులు చేప ట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించడం జరిగిందన్నారు. ఆ మేరకు చేపట్టిన పనుల తీరును క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు పాఠశాల చుట్టూ తు ప్పలు జెసిబి సహాయంతో తొలగించే పనులు స్టీల్ లెటర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు కిచెన్లోని బియ్యం కూరగాయలు కడిగిన నీరు అక్కడి కక్కడే ఇంకి పోయేందుకు నిర్మించిన సంపులు పరిశీలించారు.

కిచెను పాఠశాలలలో వా టి స్థానే కొత్త మోటార్లను ఏర్పాటు, అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసిన మూడు ఇన్వర్ట ర్లను 15 సీసీ కెమెరాలను పరిశీలించారు లైట్లు ఫ్యాన్లు రిపేరు పనులను ఎలక్ట్రికల్ పంపింగ్ సెప్టిక్ ట్యాంక్ క్యాంపస్ పెయిం టింగ్, పెయింటింగ్ పై కొటే షన్లు రెండు ఆరో ప్లాంట్లో రిపేరు పనులను తరగతి గదులు మరుగుదొడ్లకు కొత్త తలుపులు దోమల మెస్సులు ఏర్పా టు పనులను ఆయన పరిశీలించారు. గురుకు లాలలో ప్రవేశించి విద్యా భ్యాసం చేసే బాలికలకు అన్ని వసతులు ఉండేలా ప్రిన్సిపల్ అధ్యాపకులు ఎప్పటి కప్పుడు పరివేక్షిస్తూ ఉం డాలని సూచించారు.

ఈ యొక్క మరమ్మత్తు పరిశు భ్రత పనులు పటిష్టం చేస్తూ చుట్టుపక్కల పొలాల నుండి ఎలుకలు పాఠశాలలో ప్రవేశించకుండా ఎలుకల బెడద నివారణకై చర్యలు బలోపేతం చేయడం జరి గిందన్నారు ఈ సందర్భంగా ఆయన పాఠశాల సమస్యలపై ఆరా తీయగా ప్లే గ్రౌండ్ ఎత్తు చేయాలని ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ వారిని కోరారు ప్లే గ్రౌండ్ ఎత్తు పనులను ఇంజనీర్ ద్వారా చేపడ తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచా యతీ రాజ్ ఏఈ రాంజీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగా భవాని తాసిల్దార్ సుబ్బలక్ష్మి రెవెన్యూ సిబ్బంది గురుకుల సిబ్బంది పాల్గొన్నారు
