

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09:

కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకై నాబార్డు, జిల్లా లీడ్ బ్యాంకు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా ఉద్యాన శాఖ అధికారులు కేరళలోని తిరుపూర్ పారిశ్రామికవేత్తల సమ న్వయంతో సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు కేరళలోని కన్నూర్, పొల్లాచి, తిరుప్పూరు కోయంబత్తూరులోని పరిశ్రమల మేనేజింగ్ డైరెక్టర్ రవి ఐకాల్, ఎన్ ఆర్ కే పరిశ్రమల ఎండి శాస్త్రవేత్త వేణుగోపాల్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డిఆర్డిఏ పీడీలతో కొబ్బరి విలువ ఆధారిక పరిశ్రమల ఏర్పాటు ఉత్పత్తుల తయారీ విధానాలు, స్థానికంగా ఉన్న అవ కాశాలు సాధ్యసాద్యాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రకాల ఉత్పత్తులైన కొబ్బరి పౌడర్, పాలు కొబ్బరి ఫ్లేవర్ వాటర్ తయారీ, కేరళ స్పెషల్ స్వీట్ తయారీ అంశాలపై స్థానికంగా పెట్టుబడిదారులను రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సంప్రదించి పరిశ్రమల ఏర్పాటుకై నాబార్డ్ ఎల్డీఎం సిడ్బి ఉద్యాన శాఖల సమ న్వయంతో స్థానికంగా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. కొబ్బరిలో విలువ ఆధారిత ఉత్పత్తు లతోపాటు విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తులు వాటి డిమాండ్ పై ఆరా తీశారు.

కేరళ వారు తయారు చేసే ఉత్పత్తులు తయారీకై స్థానికంగా స్థల సేకరణ పెట్టుబడి అంశాలపై ఆయన చర్చించారు ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేసే సామర్ధ్యాలపై వారి ద్వారా ఆరా తీశారు. తిరుప్పూరు పరిశ్రమ నుంచి విదేశాలకు కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి మార్కెటింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎల్డీఎం కేశవ వర్మ, డి ఆర్ డి ఏ పి డి జయ చంద్ర గాంధీ తదితరులు పాల్గొన్నారు
