మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్, లక్ష₹ విరాళాలం అందించిన ఎమ్మెల్సీ పండుల

పేపర్ ప్లేట్ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఏప్రిల్ 06: అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శాసనసభ్యులు ఆనందరావు పేపర్ ప్లేట్ మిషన్ ను ప్రారంభించారు.

శాసన మండలి సభ్యులు మరియు మాజీ ఎంపీ డా” పండుల రవీంద్ర బాబు.(ఐ ఆర్ ఎస్) ఆదివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థాపించిన మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ కు లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఆయన ఇచ్చిన లక్ష రూపాయల విరాళంతో పేపర్ ప్లేట్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర బాబు సమక్షంలో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు .మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ పుణ్యమంతుల రజిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోపేపర్ ప్లేట్ మిషన్ ను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆనందరావు మాట్లాడుతూ మహిళలందరూ స్వయం ఉపాధి ద్వారా అందరూ ముందుకు వెళ్లాలని, ప్రతి మహిళ పొదుపును పాటిస్తూ సమాజంలో ఆదర్శంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి రవీంద్ర బాబు మాట్లాడుతూ మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ వారికి ఇచ్చిన మాట ప్రకారం పేపర్ ప్లేట్ మిషన్ కొనివ్వడం జరిగిందని దీనిని లబ్ధిదారులు చక్కగా ఉపయోగించుకుని ఆర్థికంగా ఆయన ఎదగాలని ఆకాంక్షించారు.
మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న రజని మరియు సభ్యులను ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానిక సర్పంచ్ తిరుకోటి సుజాత, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు మండలిక సుబ్రహ్మణ్యం శర్మ (దత్తుడు ) మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ముద్రగడ నివాసంపై దాడి ఖండించిన తుమ్మలపల్లి రమేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కాకినాడ ఫిబ్రవరి 02:ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది.ముద్రగడ అంటే పవన్‌కు,పార్టీ నేతలకు అపారమైన గౌరవం ఉందని ,దాడితో జనసేన పార్టీ కు […]

సముద్ర తీర ప్రాంతం ఆక్వా జోన్. ఆక్వా చెరువులు వేల ఎకరాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 28: సముద్ర తీర ప్రాంత ఆక్వా జోన్ మరియు ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వాచెరువులు ఉన్నది జి యో […]

పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ కు కృతజ్ఞతలు తెలిపిన నేదునూరి వీర్రాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 15: గురువారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లతో సమావేశమై రైతులపక్షాన వాణీ […]