
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూన్ 06:

విద్యాశాఖ మంత్రి లోకేష్ తో పాటు అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్సీపి విద్యార్థి విభాగం అధ్యక్షులు మిండుగుదుటి శిరీష్ ఆదేశాల మేరకు ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లెల్ల రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు గంటి ఆకాష్ వినతి పత్రం అందజేశారు.పదవ తరగతి పరీక్షలు మూల్యాంకనాన్ని లోపభూయిష్టంగా నిర్వహించారని, వారికిచ్చిన, వినతి పత్రంలో పొందుపరిచారు. తప్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని, లేనిపక్షంలో మంత్రి లోకేష్ తో పాటు సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలని ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లెల్ల రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా విద్యార్థి విభాగం సభ్యులు మోరం రవి ప్రసాద్,రైనా, బడుగు మోహన్, కరుణ సాయి, తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.