అమలాపురంలో మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి వర్ధంతి వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మార్చి 03: మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.బాలయోగి తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ సమీపంలో ఉన్న జిఎంసి బాలయోగి స్టేడియం ప్రాంగణం బాలయోగి స్మృతి వనం లో ఉన్న బాలయోగి నిలువెత్తు విగ్రహాం వద్ద వేలాదిమంది నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య తనయుడు పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో పెట్టింది ఆయనే అన్నారు. విశ్వ వ్యాప్తంగా కోనసీమకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అలాంటి కారణజన్ముడి కడుపున పుట్టటం నా అదృష్టం అన్నారు. నాన్నగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన ప్రేమ, సేవా దృక్పథం ,అంకితభావం, ఆప్యాయతలు కలిగి ఉండటం వలన మన అందరి హృదయములో చిరస్థాయిగా నిలిచిపోయారు అని అన్నారు .

భౌతికంగా మరణించారు గాని ఆత్మీయంగా మన మధ్యలోనే ఉన్నారని తనయుడు ఒక్క క్షణం హరీష్ కన్నీటి పర్వం అయ్యారు. అనంతరం అశ్రునయనాల తో ఆయన దివ్య స్మృతికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలయోగి అభిమానులు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Related Articles

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం ,డిసెంబర్ 29,2024 అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం […]

త్వరలోనే మరో మెగా డీఎస్సీ: భట్టి

నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే మరో 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయబోతున్నట్టు ప్రకటించారు. శనివారం ‘ఒకరోజు హాస్టల్ తనిఖీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. […]

నూతన అధ్యక్షుడుతో అయినవిల్లి వైసిపి పార్టీకి జవసత్వాలు: పార్టీ శ్రేణులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 08: అయినవిల్లి మండల వైసీపీ నూతన అధ్యక్షుడు రాకతో పార్టీ జవసత్వాలు అందుకున్నాయని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. డాక్టర్ […]

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ గెడ్డం పల్లాలమ్మ జన్మదిన వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉప్పలగుప్తం జూలై 01: ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గెడ్డం పల్లాలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ […]