రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు భారీ బందోబస్తు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం/కాట్రేనికోన:

మే 30: రేపు శనివారం 31వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగావించినట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.

శుక్రవారం ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ముఖ్యమంత్రి పర్యటనల కన్వీనర్ పెందుర్తి వెంక టేష్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రాష్ట్ర టిడిపి నాయకులు గుత్తులు సాయి,జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కృష్ణారావుల తో కూడిన బృందం హెలిపాడ్ ప్రజావేదిక, చెరువు పూడికతీత పనులు, పార్టీ క్యాడర్ సమావేశ ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లపై విధులు బాధ్యతలు కేటాయించిన అధి కారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. పటిష్టమైన ఏర్పాట్ల నడుమ ముఖ్యమంత్రి పర్యటనను ప్రజా వేదిక, బంగారు కుటుంబాల దత్తత, సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ ఇతర కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు కె మాధవి, పి శ్రీకర్, డి అఖిల సర్వ శిక్ష అభియాన్ సహాయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జి మమ్మీ, ట్రాన్స్కో ఎస్సీ ఎస్ రాజబాబు పంచాయతీరాజ్ ఎస్సీ పి రామకృష్ణారెడ్డి ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ సి సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి వివిధ శాఖలకు చెందిన అధి కారులు పాల్గొన్నారు

Related Articles

యువగళానికి రెండేళ్లు రామచంద్రపురం కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రామచంద్రపురం జనవరి 27:యువగళానికి రెండేళ్లు రామచంద్రపురం కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ […]

డాక్టర్ రవితేజా కు నూతన సంవత్సర శుభాకాంక్షలు: తెలుగు నేత కృష్ణ

2025 నూతన సంవత్సరంను పురస్కరించుకుని బుధవారం అమలాపురం కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కు లెక్చరర్ మరియు తెలుగు దేశం పార్టీ నేత పంబల కృష్ణ కలిసి కొత్త […]

రైతుల సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేస్తాం: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.

కలెక్టర్ సమక్షంలో ఐదుగురు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: ఆదర్శ రైతు నాయకులు కొరిపల్లి సాంబమూర్తి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 24: కోటిపల్లి- […]

చిక్కడపల్లి పోలీసుస్టేషన్ కు అల్లు అర్జున్

సినిమా హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసు […]