రామచంద్రపురం,ఏప్రిల్ 06 (ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు//
•విద్యా రంగంలో నవ శకానికి నాంది
•ఆధునిక విజ్ఞానం లక్ష్యంగా శ్రీ వివేకానంద స్కూల్ అడుగులు
•కరస్పాండెంట్
బి ఏ ఎస్ సరోజినీ నిరంతర పర్యవేక్షణలో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన విద్య.
•రెండు సంవత్సరాల్లోనే తల్లిదండ్రుల ఆదరాభిమానా లను చూరగొన్న శ్రీ వివేకానంద విద్యాసంస్థలు.
•వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో మెరిసిన చిన్నారులు
•ఇదే వేదికపై గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

పట్టణంలో శ్రీ వివేకానంద స్కూల్ విలువలతో కూడిన అధునాతన విద్యా బోధన శ్రీ వివేకానంద స్కూల్ సొంత మనీ,విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ పాఠశాల ఎంతో దోహదపడుతుంద ని మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవీ శ్రీధర్ అన్నారు. శ్రీ వివేకానంద స్కూల్ వార్షికోత్సవం శనివారం రాత్రి విజయ ఫంక్షన్ హాల్ నందు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆనందోత్సాహాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నత ప్రతిభను చాటి తల్లిదండ్రులను మురిపించి మైమరిపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చైర్ పర్సన్ శ్రీదేవి మాట్లాడారు. శ్రీ వివేకానంద స్కూల్ పట్టణంలో నవ విద్యా శకానికి తెర లేపారని అన్నారు. విద్యార్థి కెరీర్లో వెలుగులు నింపేందుకు 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వారికి కాంపిటేటివ్ పరీక్షల్లో ఉపయోగపడే విద్యను సైతం కొనసాగించడం హర్షణీయమని అన్నారు. మరో ముఖ్య అతిథి రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిబద్ధతగల విద్యా ప్రణాళికతో శ్రీవివేకానంద స్కూల్ జరుగుతుంద న్నారు. పిల్లలకు ఆధునిక విజ్ఞానాన్ని బోధించుటలో రామచంద్ర పరిసర ప్రాంతాలకు ఈ స్కూలు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పిల్లవాణ్ణి కాళ్లు చేతులు కట్టిపడేసినట్టు కాకుండా విద్యను సరికొత్త ఇంటరాక్టివ్ విధానంలో బోధించడం వల్ల విద్యార్థి సార్వత్రిక వికాసాన్ని పొందగలుగుతాడని పేర్కొన్నారు. కరస్పాండెంట్ బి ఏ ఎస్ సరోజిని మాట్లాడుతూ ఇంతవరకు కాకినాడ ఇంద్రపాలెం,మధురా నగర్, సామర్లకోట రాయవరం, రామచంద్రపురం ప్రాంతాలలో శ్రీ వివేకానంద విద్యా సంస్థలు 5 బ్రాంచీలలో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. నూతన విద్యా సంవత్సరం నుంచి పసలపూడి శ్రీ సిటీ లోను ఆరో బ్రాంచ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలిపేందుకు సంతోషంగా ఉందన్నారు. తాను పిల్లల పట్ల నిరంతరం తల్లి లాంటి పర్యవేక్షణతో వ్యవహరిస్తూ ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తమ విద్యాసంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్సీఈఆర్టీ సిలబస్, ఒలింపియాడ్, నీట్, కోర్సులు, మూడో తరగతి నుండి 9వ తరగతి వరకు అమలు చేస్తామని ఆమె తెలిపారు. దీంతో పాటు ఏసీ క్యాంపస్ హాస్టల్, సౌకర్యవంతమైన బస్సు సదుపాయం, ప్లే స్కూలు నుండి పదవ తరగతి విద్యార్థులకు అత్యుత్తమమైన ఆధునిక విద్యాబోధన అందిస్తామని తెలిపారు. శ్రీవివేకానందకు అడుగడుగునా చేయూతనిచ్చి తమ ఉన్నతికి కారణమైన శ్రేయోభిలాషులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చివరగా శ్రీ వివేకానంద స్కూల్ విషయములో తల్లితండ్రుల ఆదరణ గాని, వారి ప్రోత్సాహం గానీ వెలకట్టలేమని సరోజినీ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద స్కూల్ చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర రావు,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ శైలుషా, అకాడమిక్ డీన్ సిహెచ్. వికాసా, శ్రీ వివేకానంద స్కూల్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.