మండపేటనియోజకవర్గంలో ఎక్కడైనా కల్తీ మద్యం ఉంటే రుజువు చేయాలి:ఎమ్మెల్యే వేగుళ్ళ సవాల్…

జగన్ హయంలో పాపమే ఇది…

అభివృద్ధి చూసి ఓర్వలేని తనం…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట అక్టోబర్14:

కల్తీ మద్యం ఉంటే అడ్డుకోరె…

కల్తీ మద్యం వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి ప్రతిపక్ష నేతగా ఉన్న తోట త్రిమూర్తులు ఈ కల్తీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఎందుకు అడ్డుకోవడం లేదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రశ్నించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేని తనంతో జగన్ పార్టీ గగ్గోలు పెడుతుందని దుయ్యబట్టారు. గూగల్, ఏఐ లలో ఎక్కడ వెతికినా రాష్ట్రం అభివృద్ధి లో నెంబర్ వన్ గా వస్తుందన్నారు. ఇది చూసి ఏం చేయాలో పాలు పోని ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు కూటమి ప్రభుత్వం పై చేస్తుందన్నారు. ఈ మద్యం కేసు వెలికి తీసిందే తమ ప్రభుత్వం అన్నారు. వైసీపీ పార్టీ వారే కీలక సూత్రధారులనీ అంటున్నారని వాస్తవాలు సిట్ విచారణ లో వెల్లడి అవుతాయని పేర్కొన్నారు. ఏ పార్టీ వారు ఉన్నా వారిని ఉపేక్షించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షిస్తుందని పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గంలో ఎక్కడైనా మద్యం కల్తీ ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు.

కల్తీ పై వైసీపీ అధిష్టానం చెప్పమన్నట్లు చెప్పడం ఎందుకని పేర్కొన్నారు. అసలు ఇక్కడ కల్తీ మద్యం ఉంటే అధికారులు, కలక్టర్ లకు ఫిర్యాదు చేయొచ్చని, లేకుంటే నిరసన చేయొచ్చని అలాంటివి ఏమి లేకుండా పార్టీ చెప్పినట్లు తోలు బొమ్మలాట లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనో సీనియర్ నాయకుడని ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కల్తీ మద్యాన్ని ఏరులై పారించిన ఘనత గత వైసీపీ పాలకులదేనని విమర్శించారు. జగన్ హయంలో ఈ కల్తీ మద్యం తో వేలాది మంది మృతి చెందగా ఎందరో ఆసుపత్రులు పాలయ్యారనే విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో దేశమంతా డిజిటల్ కరెన్సీ వైపు వెళితే జగన్ మద్యం షాపుల వద్ద ఆన్ లైన్ వద్దు నగదు ఇవ్వాలని చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి నకిలీ నీ అమ్మి జనం ధన, మాన ప్రాణాలు దోపిడీ చేసిన విషయం ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.

అనంతరం మాట్లాడుతూ రాయవరం లో శ్రీ లక్ష్మి గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన ఘటన దురదృష్టమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే హోం మంత్రి అనిత గారు ఇక్కడకి విచ్చేశారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి విచారణ కు ఆదేశాలు ఇచ్చారన్నారు. త్వరలోనే బాధితులకు పరిహారం అందుతుందన్నారు. బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు, జెడ్.మేడపాడు సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, పిల్లా తాతాలు, ఉండవిల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

సుపరిపాలనకు తొలి అడుగు.. ఇంటింటికి సంక్షేమ సందేశం/రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్

అరాచక పాలన నుంచి సుపరిపాలన వైపు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జూలై 03: సమస్యలు తెలుసుకుంటూ.. కరపత్రాలు పంచుతూ.. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం.. ప్రజల అభిప్రాయాలకే […]

దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు రాజుకు సత్కారం

రామచంద్రపురం, 17 డిసెంబర్ ప్రజా ఆయుధం :తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చియ్య చౌదరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి […]

శెట్టిబలిజ హెల్పింగ్ హాండ్స్ ద్వారా 25₹వేలు సహాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 03: శెట్టిబలిజ హెల్పింగ్ హాండ్స్ ద్వారా 25₹వేలు వైద్య సహాయం అందించారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం […]