డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 325 అర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 10:

మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అందిన అర్జీలలో సింహభాగం సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అవు తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్ట రేట్లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లాస్థాయి కార్య క్రమాన్ని జిల్లాస్థాయి అధి కారులతో నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అర్జీదారుల నుండి సుమారుగా 325 అర్జీలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాoతి, డిఆర్ఓ రాజకుమారి డిఆర్డిఏ, డ్వామా పిడిలు శివ శంకర్ ప్రసాద్ మధు సూదన్, ఎస్ డి సి కృష్ణమూర్తిలు స్వీక రించారు.

అన్ని శాఖల మం డల స్థాయి అధి కారులు మండల స్థాయి మీకోసం కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహిస్తే చాలావరకు సమస్యలు పరిష్కరించ బడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంద జేసిన అర్జీల గూర్చి సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో సంప్రదించి పరిష్కారానికి ఆదేశాలు జారీచేసారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలని , గడువులోగా అర్జీలను అర్జీదారుల సంతృప్తి ధ్యేయంగా పూర్తిస్థాయి పరిష్కారాలు చూపాలన్నారు

గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యల గూర్చి కూడా ప్రజలు జిల్లా కార్యాలయానికి వస్తున్నారని, అందు వలన ప్రజలకు డబ్బు, సమయం వృదా అవుతున్నాయన్నా రు. అం దిన అర్జీలను గడువు లోగా సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తూ ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీ యతను పెంపొం దించాలన్నారు ప్రతి సోమ వారం జిల్లా కేంద్రం తో పాటు మండల కేంద్రా లలో గల తహశీల్దార్ లేదా ఎమ్.పి.డి.ఒ కార్యాల యాలలవద్ద ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార కార్య క్రమం నిర్వహించ బడుతున్న దనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని, గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టరు తెలిపారు.

మండల కార్యా లయం లో అందజేసిన ప్రతి ధరఖాస్తుపై చర్యలు తీసుకోవడం జరుగు తుందని, తీసుకున్న చర్యలను జిల్లాస్థాయిలో సమీక్షించడం జరుగు తుందని జిల్లా కలెక్టరు తెలిపారు. కావున అచ్చట కూడా ప్రజలు సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తు చేసు కొనవచ్చునన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి పిజిఆర్ఎస్ లో సమర్పిం చాలని ఆయన స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చి న అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అం దుకుగాను వచ్చిన ప్రతీ ఆర్జీని అవగాహన చేసు కోవడం, అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గూర్చి మాట్లాడడం, సమస్య సంబంధిత శాఖ పరిధిలోనిది అయితే విచారించి పరిష్కార మార్గాలు చూపాలని శాఖ పరిధిలోనిది కాకపోతే తెలియజే యడం, అందుకు గల కారణాలను వివరించ డం, తదుపరి కార్యాచ రణ పై అర్జీదారునికి అవగాహన కల్పించడం వంటి సూత్రా లను పాటించాలని అధి కారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.

ఈ కార్యక్ర మంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం దుర్గారావు దొర, డి సి హెచ్ ఎస్ కార్తీక్, డిపిఓ శాంత లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సిహె చ్ ఎన్వి కృష్ణారెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

మద్దాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ అయినవిల్లి 19 ఫిబ్రవరి 2025: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.డాక్టర్ […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]

తోట ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట డిసెంబర్ 25:ఈనెల శుక్రవారం 27న మండపేట వైసీపీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి […]

ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించండి: నక్క సునీల్ రాజ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అయినవిల్లి ఫిబ్రవరి 15: ఉభయ గోదావరి ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నక్క సునీల్ రాజు కోరారు. డాక్టర్ బి […]