పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరం: MLA ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం మార్చి 07,

ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరంగా మారాయని స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాల 7వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాలలో దాదాపు 50 నుంచి 90 శాతం అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన మందు లు లభిస్తాయన్నారు తెలిపారు.

అన్ని రకాల జబ్బులకు ఈ కేంద్రాలలో మందులు లభిస్తాయ న్నారు. ఈ కేంద్రాలలో బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్, థైరాయిడ్ ఇతర అనేక రకాలైన జబ్బులకు మందులు లభిస్తాయని తెలిపారు. ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న వాళ్లకు ఈ కేంద్రాలు ఒక మంచి అవకాశమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశమంతటా వేలాది కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ పీఎం జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం జన ఔషధీ జనరిక్ షాపులను సద్వినియోగం చేసుకోవా లన్నారు.ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తక్కువ ధరలకు మెరుగైన జన ఔషధీ మందులు లభిస్తు న్నాయన్నారు ఈ ప్రాంత ప్రజలు పీఎం జన ఔషధ జనరిక్ షాపులను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవ నాన్ని కొనసాగించాల న్నారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు మాట్లాడుతూ బ్రాండెడ్ మందులు శస్త్రచికిత్సా వినియోగ వస్తువుల యొక్క అధిక ధర కారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు తగిన ఆరోగ్య సంరక్షణ చికిత్స లను పొందలేకపోతున్నా రని, ఇలాంటి పరిస్థితుల లో నిరుపేదలకు ఈ యొక్క జన ఔషధీ కేంద్రాలు వారి పాలిట కల్పతరువుగా మారి వైద్య సేవలు సులభంగా పొంద గలుగుతున్నార న్నారు. భారత ప్రభుత్వ ప్రధాన చొరవ, ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన, సరసమైన మరియు అధిక-నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవల ను పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వారికి చవకైన ఆరోగ్య సంరక్షణను అందించ డానికి ప్రయత్నిస్తుంద న్నారు. జిల్లా వైద్య అ రోగ్య శాఖ అధికారి ఎం దుర్గా రావు దొర మా ట్లాడుతూఅభాగ్యులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్ర యోజన జన్ ఔషధి కేంద్రాలను స్థాపించడం ద్వారా, ప్రజలు తక్కువ ధరలో బ్రాండెడ్ మందులతో సమానంగా ఔషధ ఔషధాలను పొందగ లుగుతున్నారన్నారు వార్షికోత్సవం పురస్కరిం చుకొని ఆసుపత్రిలోని రోగుల వ్యాధి నివారణ ఔషధాలను ఉచితంగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ కార్తీక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ రూపేష్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రజాప్రతి నిధులు ఎం ప్రభాకర్ ఏ జయలక్ష్మి పి ధర్మపాల్ నల్ల చిట్టిబాబు వలవల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు

Related Articles

మానవత్వం చాటుకున్న మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంబాజీపేట ఆగస్టు 15: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం‌ అంబాజీపేట మండలం ముక్కామల‌ గ్రామంలో దళిత (యస్సీ మాదిగ) […]

ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన మాతా రమాబాయి సంఘం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం మే 20: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను రజిని మర్యాదపూర్వకంగా కలిశారు.మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ పుణ్యమంతుల రజనీ తన […]

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 01: అమలాపురం పార్లమెంట్ పరిధి,పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలంక గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతినెలా అందించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను […]

కోడిపందాలు గుండాట పై ఉక్కు పాదం:ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ

కోడిపందాలు గుండాట మరియు రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతులు లేవని ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అయినవిల్లి మండలం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ హెచ్చరించారు.శనివారం ఆమె అయినవిల్లి పోలీస్ అధికారి మరియు రెవెన్యూ […]