ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా వేదిక నిలుపుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఫిబ్రవరి 2:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కు సంబంధించిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3వ తేదీ నుండి ప్రతి సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) మరియు మండల కార్యా లయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు నిర్వహించడం లేదని తెలిపారు. కేవలం గ్రామ సచివాలయాలలో మాత్రమే అర్జీదారులు తమ యొక్క ఫిర్యాదులను నమోదు చేసుకొన వచ్చునని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Related Articles

సర్పంచ్ కాశి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు| డాక్టర్ రవితేజకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 26: మాగం గ్రామ సర్పంచ్ కాశి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. […]

నకిలీ ఏజెంట్ మోసం ఇండియాకు రప్పిస్తాం కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అండగా ఉంది

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 16: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామానికి చెందిన పొన్నాడ మంగ కుమారుడైన పొన్నా డ కనకరాజును ఒక […]

ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 12: ప్రజా వేదిక టోల్ ఫ్రీ నెంబర్ 1100 దయచేసి వినియోగించండి : ప్రజా వేదిక కలెక్టరేట్ ఈనెల 13 వ […]

ఈవీఎంల గోదాము ను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం, ఫిబ్రవరి 28, 2025 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ బి ఆర్ ఎ జిల్లా రెవెన్యూ […]