
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కాకినాడ రూరల్ జనవరి 29;

పి.గన్నవరం నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా అయినవిల్లి జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు పేరును అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసినదే! గౌరవార్థం గా గన్నవరపు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు పర్యటిస్తూ..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులును అయిన మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో బుధవారం ఉదయం కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ను గన్నవరపు శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధినేత ఆశీస్సులతో పెద్దలందరూ సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జిగా నా పేరును ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి కన్నబాబు స్వగృహం నందు గన్నవరపుకు శాలువ కప్పి మన ప్రియతమ అధినేత జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. అనంతరం సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కఠకంశేట్టి ఆదిత్య ,రాము,యడ్ల కిరణ్ బాబు, మేడిశెట్టి శ్రీను, గుత్తుల బాబి తదితరులు పాల్గొన్నారు.