పాడి పరిశ్రమ అభివృద్ధికి పశు దాన యూనిట్లు స్థాపన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 31:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పశు దాన యూనిట్లు నెలకొ ల్పేందుకు మండలాల వారీగా సంఘాలను ఏర్పాటు చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం పశుసంవర్ధక శాఖ అధికారులు ఉద్యాన అధికారులు తో సమావేశం నిర్వహించి కొబ్బరి ఉత్ప త్తుల పరిశ్రమలు ఏర్పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ప్రధాన మంత్రి పార్ము లైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను రాయితీలతో ప్రోత్సహించి కొబ్బరి ఆధారి త పరిశ్రమ స్థాపనకు జిల్లా పరిశ్రమల కేంద్రం లీడ్ బ్యాంకు అధికారులు రాయితీలతో ప్రోత్సహిం చాలని ఆదేశించారు. స్థానికంగా కొబ్బరి ఆక్వా ఉత్పత్తుల ఆధారిత పరిశ్ర మలు నెలకొల్పేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ దిశగా శాఖల సమన్వయంతో పరిశ్రమల స్థాపనకు పాటుపడుతూ సుస్థిరా అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాం ధ్ర@ 2047 లక్ష్యా లను చేరుకోవాలని సూచిం చారు.. పాడి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు సమృద్ధిగా పోషక విలువలు కలిగిన దాన ఉత్పత్తుల తయారీ యూనిట్లను నెలకొల్పుతూ సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తూ పాడి ఉత్పత్తులను పెంచి రైతులకు అదనపు ఆదాయం ఓనగూరే విధముగా మండల స్థాయిలో నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి సహకార సొసైటీల ఆర్థిక సహకారంతో దానా యూ నిట్లు నెలకొల్పాలని పశువ ర్ధక శాఖ అధికారులు ఆదే శించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, ఉద్యాన అధికారి రమణ, జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకులు వెంకట్రావు, సహాయ సంచాలకులు ఉమామ హేశ్వర రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.

Related Articles

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం జనవరి 26: 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

చలో గుంటూరు మాల సింహగర్జన సభా వేదికపై ఎవరు ఏమన్నారు! అంటే!

డాక్టర్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్ ఆదివారం గుంటూరు జిల్లా నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల సింహగర్జన మహాసభ నిర్వహించారు.మల్లీశ్వరి సభకు పరిచయ కర్తగా వ్యవహరించారు.అధ్యక్షుడుగా దేవి ప్రసాద్ సభను […]

బేడ బుడగ జంగాల పోరాటానికి అండగా ఉంటా: ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

బేడ (బుడ్గ)జంగాల పోరాటానికి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ హామీ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి జూలై 13: రాష్ట్రంలోని బేడ (బుడ్గ) […]