ఇద్దరు విద్యార్థులకు రూ.35 వేలు ఆర్థిక సహాయం: జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం 24;

కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేసు మాత.. అంటూ సమాజంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రముఖ సినీ కవి వివరించారు.. నేటి ఆధునిక యుగంలో మహిళలు నింగి నుంచి నేలదాకా.. పురుషులతో అన్ని రంగాల్లో పోటీపడుతూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కౌమార దశ నుంచి తల్లిగా.. చెల్లిగా.. భార్యగా.. భిన్న పాత్రలు పోషిస్తూ తమ ప్రాసస్త్యాన్ని చాటుకుంటున్నారు. మహిళల జీవితంలో ముఖ్యంగా బాల్య దశ చాలా ప్రాముఖ్యమైనది. ఆడపిల్లలేని ఇల్లు ఎలా ఉంటుందో ఊహించగలమా..ఇంటికి దీపం.. కంటికి రూపం.. ఆడపిల్లే ఇంటికి మణిదీపం అని అందరికీ తెలుసు. బాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం, బాలికలకు సాధికారత కల్పించే దిశగా, వారి భావి భవిష్యత్తు నిర్మాణం కోసం మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పేదరికంతో ఏ ఒక్కరూ చదువు ఆపకూడదు అనే నినాదంతో ఎంతోమంది బాలికలకు, విద్యార్థులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. మంత్రి సుభాష్ గారు పాల్గొనే ప్రతి సమావేశంలో విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను ప్రోత్సహిస్తూ నిరుపేదలైన బాలికలకు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సమాజంలో ఆడపిల్లల రక్షణ, సంరక్షణ, గౌరవం, సమానత్వం, సాధికారత కోసం అలుపెరగని కృషి చేస్తున్నారు. మహిళల జీవితంలో కౌమారదశ చాలా ప్రాముఖ్యమైనదని, వారి ఆరోగ్య సంరక్షణ కోసం పలు సమావేశాల్లో ప్రస్తావిస్తూ, తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. శుక్రవారం “జాతీయ బాలికా దినోత్సవం” సందర్భంగా మంత్రి సుభాష్ రాష్ట్రంలోని బాలికలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పేదరికం కారణంగా చదువుకొన సాగించలేక ఇబ్బంది పడుతున్న రామచంద్రపురం మండలం గొల్లచెరువు గ్రామ నివాసి సూరమూడి రిషిత అనే విద్యార్థినికి మంత్రి సుభాష్ తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించి తన భవిష్యత్తు చదువుకు తానున్నానంటూ భరోసా కల్పించారు. అలాగే రామచంద్రపురం కు చెందిన అల్లం ప్రియదర్శన్ కార్తీక్ అనే విద్యార్థి కిక్ బాక్సింగ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో, ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తూ జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని ఆశీర్వదించి రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించి తన గొప్ప మనసును మరో మారు చాటుకున్నారు మన మంత్రి సుభాష్ గారు. ఇప్పటికే పలువురు విద్యార్థులను మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు దత్తత తీసుకుని చదివిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు, కష్టకాలంలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, పేదవారిపట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ కురిపించే ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, మానవత్వానికి నిలువుటద్దం మా మంత్రి సుభాష్ అంటూ ప్రజలు వేనోళ్ళ కీర్తిస్తున్నారు.

Related Articles

మిరపకాయ్ తో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్

క్యాప్సికమ్ నుక్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, […]

డాక్టర్ కారెం రవితేజకు మాల మహానాడు ఆధ్వర్యంలో ఘన సన్మానం.

కోనసీమ కేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కారెం రవితేజకు మండల మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనసన్మానం చేసారు డా.రవితేజకు “బెస్ట్ ఎక్స్లెన్స్ డాక్టర్ “అవార్డు వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో […]