చిన్నారుల్లో క్రీడ ప్రతిభను గుర్తించాలి.ఆ దిశగా సంపూర్ణంగాప్రోత్సహించాలి:జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 7:

చిన్నారుల్లో క్రీడ ప్రతిభను గుర్తించి ఆ దిశగా సంపూ ర్ణంగా ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి వ్యాయామ ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చారు .

మంగళవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు కోనసీమ క్రీడాత్సవాలు ఆటలతో ఆరోగ్యం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నా రుల్లో సృజనాత్మకత నైపుణ్యాలను వెలికితీసే క్రీడా ప్రతిభను చాటుకు నేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారు చక్కటి వేదికను కోనసీమ క్రీడ ఉత్సవాలు ఆటలతో ఆరోగ్యం పేరిట కల్పించారని ఈ అవ కాశాన్ని వివిధ పాఠశా లల విద్యార్థిని విద్యార్థు లు సద్వినియోగపరుచు కుని క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని నిరూపించుకో వాలన్నారు.విద్యార్థులు నిర్దేశిత లక్ష్యం వైపు పయనించాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు . అప్పుడే పరిపూర్ణమైన విద్యార్థిగా ఎదుగుతార న్నారు.విద్యార్థులు క్రీడ లపై ఆసక్తి పెంచుకోవాల న్నారు. విద్యార్థిని,
విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణిం చాలని, విద్యార్థులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో క్రీడలకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలన్నా రు. క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుణ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లభిస్తాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పిఎస్ సురేష్ కుమార్ ఉప విద్యాశాఖ అధికారి సూర్య ప్రకాశం ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి జడ్పిటిసి పందిరి శ్రీహరి రాంప్రసాద్ విద్యాశాఖ అధికారులు వ్యాయామ ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన కూలీ రేట్లు 300/-రూ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో పాటు.. కూలీల కనీస వేతనాన్ని రూ.263 నుంచి […]

గుంటూరులో పోలీసులకు హర్ష కుమార్ వార్నింగ్

గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ […]

రాత్రివేళ అయినా బోటులోకి స్వయంగా వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే గిడ్డి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం మే27: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్,పి. గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామ శివారులో గోదావరి నది తీరాన మంగళవారం […]

రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు

రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లులోక్‌సభలో ప్రవేశపెట్టనున్న అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతుఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం