
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం జనవరి 03:

ఇంటర్మీడియట్ అదనపు గదులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్లస్ టూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అదనపు గదులను నిర్మించారు. ఈ క్లాస్ రూమ్ లను శుక్రవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభ్యాసాం వాతావరణానికి అనుగుణంగా మరింత సౌకర్యవంతంగా ఉండేలా తరగతి గదులు నిర్మించామన్నారు. నేటి విద్యార్థులే రాబోయే తరానికి ఆదర్శవంతులుగా నిలవాలని ఆయన విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నామాని రాంబాబు, డొక్కా నాగబాబు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎన్డీఏ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు.
