రైతుల పంట పొలాల్లో చొచ్చుకొస్తున్న ఉప్పునీటి సమస్యకు పరిష్కారం కోసం కృషి చేస్తా: ఎంపీ.. బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19:

ఉప్పలగుప్తం మండల రైతులతో ఎంపీ హరీష్ బాలయోగి…

ఎన్నో ఏళ్లుగా రైతుల పంట పొలాల చొచ్చుకుపోతున్న ఉప్పునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉప్పలగుప్తం మండలం రైతులకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ విప్ మరియు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలంలో మెయిన్ డ్రైన్ నుండి సముద్రంలో కలసే డ్రైన్ కాలువ పూడుకుపోవడం,కాలువ గట్లు బలహీన పడడంతో మండలంలోని అన్ని గ్రామాల పంట పొలాల్లోకి సముద్రపు నీరు చేసి పంట నష్టం జరగడమే కాకుండా కొబ్బరి చెట్లు సైతం దెబ్బతింటున్నాయని అమలాపురంలోని ఎంపీ నివాసం వద్ద హరీష్ ను కలసిన రైతులు పాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలని కోరడంతో త్వరలో సమస్య ప్రాంతాన్ని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్వత పరిష్కారం చేయడాని సమస్యను రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ హరీష్ బాలయోగి రైతులకు తెలిపారు.

Related Articles

ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో ఎమ్మార్వో నాగలక్షమ్మ అధ్యక్షతన ప్రభల తీర్థం కమిటీ.

అయినవిల్లి మండలం అయినవిల్లి ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 ని” ప్రభల తీర్థం కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహిస్తారు, సమావేశానికి ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు మరియు ఆసక్తి గలవారు హాజరుకావాలని […]

రేపు అక్కడ భారీ వర్షాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఆంధ్రప్రదేశ్ లో రేపు (డిసెంబర్ 20) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, అల్లూరి, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, […]

జక్కంపూడి రాజా కు పాపా రాయుడు సంఘీభావం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 22:మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు రాష్ట్ర వైసిపి కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం లో మంగళవారం ఆయనను […]

మహిళా సంఘాలకు క్రెడిట్ ప్లాన్ పై శిక్షణ (అయినవిల్లి మండలం)

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 28: స్వయం సహాయక సంఘ సభ్యులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమైన జీవనోపాదులు మరియు ఋణాలు గూర్చి ఎంపిక చేసిన ఎన్యూ […]