V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం,మే 13,2025
అమలాపురం ఈదరపల్లి కొత్త వంతెన నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించడం అయినదని అధికారులు వెల్లడించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బస్టాండ్ నుంచి బయలుదేరు ఆర్టీసీ బస్సులు గడియార స్తంభం కాలేజీ రోడ్ పేరూరు వై జంక్షన్-తోటల పాలెం- వోకలగరువు -అంబాజీపేట మీదుగా రావులపాలెం ట్రాఫిక్ మళ్లించారు. అదే విధంగా రావులపాలెం వైపు నుండి అమలాపురం వచ్చే ఆర్టీసీ బస్సులు అదే మార్గంలో వస్తున్నాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరియు లారీలు నల్ల వంతెన- జనుపల్లి- నేదునూరు -ముక్కామల మీదుగా రావులపాలెం వరకు రూట్ మళ్లించడం జరిగింది.
బైకులు, ఆటోలు, కారులు నల్ల వంతెన- సావరం బైపాస్- కొత్తగా నిర్మించిన మట్టి వంతెన మీదగా మళ్లించడం జరిగిందని అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణికులు వాహనచోదకులు గమనించి తమ ప్రయాణం సాగిస్తూ… పోలీసులకు సహకరించాలని అమలాపురం,బి రాము.ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్లు భవనాలు శాఖ, కోరింది.