విద్యా ప్రదాత ఎమ్మెల్యే ఆనందరావుకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 03:

డిగ్రీ కళాశాల సాధించిన ఎమ్మెల్యే ఆనందరావును సత్కరించిన దళిత ఐక్యవేదిక

అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవిరామంగా కృషిచేసి పేద వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కొరకు పట్టుదలతో డిగ్రీ కళాశాల సాధించిన అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు అహర్నిశలు అమలాపురం అభివృద్ధికి పాటుపడుతున్నారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు ఆయన కృషిని కొనియాడారు ఎమ్మెల్యే ఆనందరావు సాధించిన డిగ్రీ కళాశాల పేద విద్యార్థులకు వరంగా మారిందని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆనందరావు ను అభినందిస్తూ.. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా దళిత ఐక్యవేదిక చైర్మన్ డిబి లోక్ మాట్లాడుతూ విద్య యొక్క విలువ తెలిసిన ఎమ్మెల్యే ఆనందరావు పేద విద్యార్థులకు ఉన్నత విద్య కల్పించడానికి నియోజకవర్గ ప్రజల చిరకాలవాంఛ అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అమలాపురంలో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అమలాపురంలో అన్ని విధాల అభివృద్ధి చేయాలనే దృక్పథంతో అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి సాధకుడుగా ఎమ్మెల్యే ఆనందరావు ముందుకు వెళుతున్నారని అభినందిస్తూ… అశోక విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధి సాధనలో ఆయన చేస్తున్న కృషికి దళిత ఐక్యవేదిక ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేద వర్గాలకు విద్య వైద్య రంగాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత ఐక్యవేదిక చైర్మన్ డిబి లోక్ కన్వీనర్ జంగా బాబురావు కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు కోకన్వీనర్ పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు చల్లపల్లి సర్పంచ్ ఇసుక పట్ల జయమణి జంగా శ్రీను పాలమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

దిండి గ్రామంలో ఎంపీ హరీష్ బాలయోగి,ఎమ్మెల్సీ రాజశేఖర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 09: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు […]

ఏ రంగమైనా సమాజ భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 10: V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మామిడికుదురు అల్లవరం జూలై 10: సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ […]

ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా వేదిక నిలుపుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఫిబ్రవరి 2:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కు సంబంధించిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి […]

నిర్దేశిత గడువులోగా పూర్తి నాణ్యత తో పరిష్కార మార్గాలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09: అర్జీదారుల నుండి అందిన అర్జీలపై సత్వరమే స్పందించి నిర్దేశిత గడువులోగా పూర్తి నాణ్యత తో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా […]