ఉత్తరకోస్తా లో ఉదయించిన ప్రజా సూర్యుడు స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 16:

సర్దార్ గౌతు లచ్చన్న 116 జయంతి వేడుకలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ లో ఘనంగా నిర్వహించారు.

ఉత్తరకోస్తా నందు ఉదయించిన ప్రజా సూర్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ని కలెక్టరేట్ పరిపాలన అధికారి కడలి కాశీ విశ్వేశ్వ రరావు అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు సర్దార్ గౌతు లచ్చన్న 116 వ జన్మదిన వేడుకలను అధి కారికంగా జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పరి పాలనా ధికారి మాట్లాడుతూ తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, రైతు బాంధవుడు, కార్మిక శ్రేయోభిలాషి అయినా, స్వర్గీయ సర్ధార్ గౌతు లచ్చన్న చిత్రప టానికి పూలమాలలు అలం కరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి, స్వాతంత్య్ర సమర యోధులు గౌతు లచ్చన్న గారి జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో నేడు జరుగు చున్న సందర్భoగా శుభాకాం క్షలు తెలియజేస్తూ. ఈ మహో న్నత అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న వారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఆయన శ్రీకాకుళం ప్రజలకు తరతరాలుగా స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రజాసేవ పట్ల ఉన్న వారికి ఉన్న నిబద్ధత ప్రతి ఒక్కరికి సర్వదా మార్గదర్శకంగా నిలుస్తోంద న్నారు.ఆయన ధైర్యం సేవ యొక్క వార సత్వం ఇప్పటికీ మనకు మార్గనిర్దేశం చేస్తుం దన్నా రు.స్వాతంత్య్ర సమరయోధుడుగా పోరా టాలకు మారు పేరుగా గౌతు లచ్చన్న, బ్రిటిష్ రాజ్ పై తిరగబడ్డ సర్దార్ లచ్చన్న గా ప్రజల గుండెల్లో నిలిచార న్నారు.సర్దార్ వల్ల భాయ్ పటేల్ తర్వాత సర్దార్’ అనే బిరుదు పొందిన రెండవ వ్యక్తిగా ప్రసిద్ధి చెందారన్నారు. ఈ బిరుదును ఆయన సాహసం, కార్యదక్షతకు మెచ్చి ప్రజలు ఇచ్చారన్నారు. స్వాతంత్ర్య సమరయోధునిగా గాంధీజీ పిలుపుతో తన 21 వఏటనే స్వాతంత్ర్య ఉద్యమం లో చేరారన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్య మాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలు జీవితం గడిపారన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంతో అజ్ఞాతవాసంలో ఉండి కూడా కార్యకలాపాలు సాగించారన్నారు. హైకో ర్టులో కొట్టు వేయబడిన ఓ బి సి కోట పునరుద్ధరణకు పాటుపడ్డార న్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి పి రమేష్ ప్రసంగిస్తూ దాదాపు 35 సంవత్సరాల పాటు చట్ట సభలకు ఎన్నికయ్యారన్నా రు.టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించార న్నారు. జమీందారీ, ఇనాందారీ వ్యవస్థలకు వ్యతిరే కంగా అనేక రైతు ఉద్య మాలను నడిపార న్నారు. వెనుకబడిన తరగ తులు, అణగారిన వర్గాల అభ్యు న్నతి కోసం నిరంతరం కృషి చేశారని దళితులకు దేవా లయ ప్రవేశం కల్పించడం, వారి విద్యాభివృద్ధికి పాటు పడటం వంటి సామాజిక సంస్కరణలను తీసుకుని రావడంతో పాటుగా, గౌతు లచ్చన్న కేవలం ఒక వ్యక్తి కాదనీ, ఒక ఉద్యమం, ఒక విప్లవానికి ప్రతీకగా పరిగ ణించబడ్డారన్నారు.నిస్వార్థమైన నాయకత్వం, నిజాయితీ, నిబద్ధత ఆయన సొంతమ న్నారు.సామాజిక సమస్యలపై ఆయన పోరాడిన విధానం, ప్రజా సమస్యలను చట్ట సభల్లో గట్టిగా వినిపించిన తీరు గురించి,ఆయన జీవితo యువతరానికి ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలు స్తుందన్నారు. ఈ కార్యక్ర మంలో బీసీ వెల్ఫేర్ వసతి గృహ సంక్షేమ అధికారులు కల్పవల్లి అనురాధ, గౌరీ కాత్యాయని సిహెచ్ సాయిరాం, సిహెచ్ రాధాకృష్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కు ఘన సత్కారం.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక -రాజోలు డిసెంబర్ 17:చలో గుంటూరు మాలల సింహ గర్జన సభకు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర నేత గొల్లపల్లి సూర్యారావు సహకరించి, వాహనాలను సమకూర్చి సభను విజయవంతానికి కృషి […]

డాక్టర్ కారెం రవితేజా కు అభినందనలు తెలిపిన మాస్టర్ పంబల కృష్ణ

V9 ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 16: కోనసీమ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజ కు అయినవిల్లి మండల శానపల్లిలంక టిడిపి నేత మరియు లెక్చరర్ పంబల కృష్ణ […]

శ్రామిక హక్కుల పోరాట యోధుడు మచ్చా నాగయ్య

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి /అమలాపురం ఆగస్టు 06: కష్టజీవులు శ్రామికుల హక్కులకై పోరాడిన ఉద్యమకారుడు కామ్రేడ్ మచ్చ నాగయ్య అని ఆయన మరణం పేద బడుగు బలహీన వర్గాల […]

గుంటూరులో హర్ష కుమార్ పోలీసులకు వార్నింగ్

గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ […]