
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం,తేదీ 24:
ముమ్మిడివరం మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో Intellectual Patent Rights ( గురించి మరియు ప్రభుత్వ పథకాల విధివిధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని బ్యాంకు నుండి రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చాలా రకాలైన పథకాలను కల్పిస్తుందని దీనికి బ్యాంక్ వారికి ఎటువంటి గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఐదు కోట్ల వరకు క్రెడిట్ గ్యారెంటీ ఇస్తుందని తద్వారా ఎవరైనా వ్యక్తిగత రుణాలను పొందుటకు గాను జిల్లా పరిశ్రమల శాఖను సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని మాధురి, ni-msme కో-ఆర్డినేటర్ వెంకట్ ఎంఎస్ఎఫ్ఈ ఫ్యాకల్టీ గణేష్, పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కే వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.